ప్రత్యేక దృష్టి సారించి శిక్షణ పూర్తి చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-10-30T05:13:31+05:30 IST
కుట్టు శిక్షణ కేంద్రంలో ఎస్‌బీఐ బ్యాంక్ ద్వా రా శిక్షణ నేర్చుకుంటున్న నిరుద్యోగ యువతులు ప్రత్యేక దృష్టి సారించి శిక్షణ పూర్తి చేసుకోవాలని శిక్షణలో నేర్పే మెళకువలు జీవితంలో స్థిరపడేందుకు దోహదం చేస్తాయని ఎస్‌బీఐ బ్యాంక్ డీజీఎం అన్నారు.
డిచ్‌పల్లి, అక్టోబరు 29: కుట్టు శిక్షణ కేంద్రంలో ఎస్‌బీఐ బ్యాంక్ ద్వా రా శిక్షణ నేర్చుకుంటున్న నిరుద్యోగ యువతులు ప్రత్యేక దృష్టి సారించి శిక్షణ పూర్తి చేసుకోవాలని శిక్షణలో నేర్పే మెళకువలు జీవితంలో స్థిరపడేందుకు దోహదం చేస్తాయని ఎస్‌బీఐ బ్యాంక్ డీజీఎం అన్నారు. శుక్రవారం డిచ్‌పల్లిలోని ఎస్‌బీఐ కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా సం దర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ నేర్చుకుంటున్న వారితో మాట్లాడు తూ.... ఎస్‌బీఐ ద్వారా శిక్షణ పూర్తైన వారికి తమ కాళ్లపై తాము నిలబడేందుకు బ్యాంకు రుణాలు కూడా అందజేస్తామని, మహిళల నేర్చుకున్న శిక్షణ ద్వారా జీవన ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకోవా లన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ శిక్షణను నిర్వహిస్తున్న ఎస్‌బీఐ రూరల్ ఎంప్లాయిమెంట్ సిబ్బందిని డీజీఎం అభినందించారు.