అంగన్వాడీ టీచర్లతో ట్రెయినీ ఐఏఎస్‌ల సమావేశం
ABN , First Publish Date - 2021-03-21T05:34:04+05:30 IST
మండలంలోని చౌట్‌పల్లి గ్రామ ంలో ట్రెయినీ ఐఏఎస్ అధికారులు శనివారం అంగన్వాడీ టీచర్లతో సమావేశమయ్యారు. అధికారులు అవుల సాయి కృష్ణ, సామేసింగ్ మీన, రౌత్ గౌరవ్ కిషోర్, చైమన్‌కర్ వి శ్వజీత్ గజానన్‌లు అంగన్వాడీ సెంటర్ల నిర్వహన, టీచర్ల రోజువారీ కార్యక్రమాలు, గర్భిణులు, బాలింత్లలకు అందిం చే పౌష్టికహారం తదితర వివరాలను సేకరించారు.

కమ్మర్‌పల్లి, మార్చి 20: మండలంలోని చౌట్‌పల్లి గ్రామ ంలో ట్రెయినీ ఐఏఎస్ అధికారులు శనివారం అంగన్వాడీ టీచర్లతో సమావేశమయ్యారు. అధికారులు అవుల సాయి కృష్ణ, సామేసింగ్ మీన, రౌత్ గౌరవ్ కిషోర్, చైమన్‌కర్ వి శ్వజీత్ గజానన్‌లు అంగన్వాడీ సెంటర్ల నిర్వహన, టీచర్ల రోజువారీ కార్యక్రమాలు, గర్భిణులు, బాలింత్లలకు అందిం చే పౌష్టికహారం తదితర వివరాలను సేకరించారు. అనం తరం గ్రామ సర్పంచ్ మారుశంకర్ అధ్యక్షతన నిర్వహించి న పోషన పక్షోత్సవాలను వారు ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ప్రతిజ్ఞ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో సుధారాణి, ఏసీడీపీవో జ్ఞాణేశ్వరి, సూపర్‌వైజర్‌లు కవిత, పద్మ, పంచాయతీ కార్యదర్శి గంగజమున, గర్భిణులు, బా లింతలు పాల్గొన్నారు. అంతకు ముందు గ్రామంలో వయో వృద్ధులతో సమావేశమైన అధికారులు చౌట్‌పల్లి గ్రామాభి వృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుతీరు, సదుపాయాలపై వి వరాలను అడిగి తెలుసుకున్నారు.
రెంజర్లలో ముగిసిన అధ్యయనం
ముప్కాల్: మండలంలోని రెంజర్ల గ్రామంలో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ట్రెయినీ ఐఏఎస్ అధికారుల అధ్యయనం శనివారం ముగిసింది. శనివారం ఉదయం అ ధికారులు గ్రామంలో పర్యటించి కాలువలను పరిశీలించా రు. కాలువల ద్వారా సాగునీరు సరఫరాపై వివరాలు అడి గితెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయులుగా మారి పోటీ పరీక్షలకు ఎదుర్కోవడానికి విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. వీడ్కోలు సమావేశంలో ఐకేపీ ఆధ్వర్యంలో తెలంగాణ సంప్రదాయంలో పండగలు, బతుకమ్మ ఆడి బతుకమ్మ గురించి వివరించారు. ఈ కార్య క్రమంలో రీజనల్ ట్రెయినింగ్ మేనేజర్ ఆంజనేయులు, త హసీల్దార్ రోజా, వైస్ ఎంపీపీ ఆకుల చిన్న రాజన్న, సర్పం చ్ ఆకుల రాజారెడ్డి, ఉపసర్పంచ్ మోహన్‌రెడ్డి, సెక్రెటరీ స్వప్న, ఆశ వర్కర్‌లు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.