శ్వాస్‌ ఆధ్వర్యంలో సంప్రదాయ శిక్షణ తరగతులు

ABN , First Publish Date - 2021-05-30T06:49:52+05:30 IST

శ్రీవైష్ణవ ఆగమ సంప్రదాయ సేవా సమితి ఆధ్వర్యంలో (శ్వాస్‌) ఆదివారం నుం చి సాంప్రదాయ శిక్షణ తరగతులు ప్రారంభమవుతున్నట్లు ఉమ్మడి జిల్లా బాధ్యులు గోవర్ధనం వెంకటరమణ చార్యులు, మల్యాల హరిబాబు, కందాళై గోపాలచార్యులు పేర్కొన్నారు.

శ్వాస్‌ ఆధ్వర్యంలో సంప్రదాయ శిక్షణ తరగతులు

నిజామాబాద్‌కల్చరల్‌, మే 29: శ్రీవైష్ణవ ఆగమ సంప్రదాయ సేవా సమితి ఆధ్వర్యంలో (శ్వాస్‌) ఆదివారం నుం చి సాంప్రదాయ శిక్షణ తరగతులు ప్రారంభమవుతున్నట్లు ఉమ్మడి జిల్లా బాధ్యులు గోవర్ధనం వెంకటరమణ చార్యులు, మల్యాల హరిబాబు, కందాళై గోపాలచార్యులు పేర్కొన్నారు. ప్రతిరోజు సాయంత్రం 7గంటల నుంచి 8.30గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. స్తోత్రపాఠం, ప్రబంధ విభాగం, ఆగమ విభాగం, వేదభాగంలుగా విభజించడం జరిగిందన్నారు. ఆయా విభాగాల్లో నిష్ణాతులైన పండితులచేత తరగతు లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు 9494428861, 94904 15468 నెంబర్‌లను సంప్రదించాలని సూ చించారు. తరగతులకు ఎలాంటి రుసుం తీసుకోకుండా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-05-30T06:49:52+05:30 IST