నేడు బీర్కూర్‌లో స్పీకర్‌, మంత్రి గంగుల పర్యటన

ABN , First Publish Date - 2021-12-31T05:41:55+05:30 IST

మండల కేంద్రంలో శుక్రవారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పర్యటించనున్నారు.

నేడు బీర్కూర్‌లో స్పీకర్‌, మంత్రి గంగుల పర్యటన

బీర్కూర్‌, డిసెంబరు 30: మండల కేంద్రంలో శుక్రవారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పర్యటించనున్నారు. బీర్కూర్‌లో ఉదయం 9.30 గంటలకు గ్రామ పంచాయతీ షాపింగ్‌ కాంప్లెక్స్‌, 10 గంటలకు బీర్కూర్‌లో బీసీ గురుకుల పాఠశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు లాడేగాం వీరేశం తెలిపారు. బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు సభాస్థలిని పరిశీలించారు. మధ్యాహ్నం నస్రు ల్లా బాద్‌ మండలంలోని మైలారం గ్రామంలో నూతనంగా నిర్మించిన గోదాంలను స్పీకర్‌, మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ ద్రో ణవల్లి అశోక్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సతీష్‌,  గంగాధర్‌, వీరేశం, రాజు, తహ సీల్దార్‌ రాజు, ఎంపీడీవో రాధ, సూపరింటెండెంట్‌ భరత్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T05:41:55+05:30 IST