ముగ్గురు పంచాయతీ కార్యదర్శులకు మెమోలు జారీ
ABN , First Publish Date - 2021-07-09T05:17:28+05:30 IST
మండలంలోని హనుమాన్ ఫారం, గాంధీ నగర్, లింగాపూర్ పంచాయతీ కార్యదర్శులకు గురువారం డీఎల్‌పీవో నాగరాజు మెమోలు జారీ చేశారు.

నవీపేట, జూలై 8 : మండలంలోని హనుమాన్ ఫారం, గాంధీ నగర్, లింగాపూర్ పంచాయతీ కార్యదర్శులకు గురువారం డీఎల్‌పీవో నాగరాజు మెమోలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాలను గు రువారం సందర్శించారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు సరిగ్గా నాటక పోవడంతో హనుమాన్ ఫారం పంచాయతీ కార్యదర్శి రాజగంగు, గాంధీ నగర్ పంచాయతీ కార్యదర్శి అంజలి, లింగాపూర్ పంచాయతీ కార్యదర్శి సునీతలకు మెమోలు జారీ చేశారు. 24 గంటల్లో సంబంధిత పంచాయతీ కార్యదర్శులు సమాధానం ఇవ్వాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీవో రాజ్‌కాంత్‌రావు, ఏపీఎం భూమేష్ గౌడ్, తదితరులున్నారు.