కొవిడ్‌ లక్షణాలున్న వారిని గుర్తించాలి

ABN , First Publish Date - 2021-05-19T05:25:54+05:30 IST

కొవిడ్‌ లక్షణాలున్న వారిని గుర్తించాలని ఐసీడీ ఎస్‌ పీడీ ఝాన్సీ అన్నారు. గంగారాం తండా పరిధిలో కొనసాగుతున్న ఇం టింటి ఆరోగ్య సర్వేను మంగళవారం సీడీపీవో సునితతో కలిసి పరిశీలించారు. లోలం, ఎల్లారెడ్డిపల్లి, వెంగల్‌పహాడ్‌, తిర్మన్‌పల్లి గ్రామాల్లో కొనసాగుతున్న సర్వేను ఎంపీడీవో రాములునాయక్‌ పరిశీలించారు.

కొవిడ్‌ లక్షణాలున్న వారిని గుర్తించాలి
దొన్కల్‌లో సర్వేను పరిశీలిస్తున్న మండల స్పెషల్‌ ఆఫీసర్‌

ఇందల్‌వాయి, మే 18: కొవిడ్‌ లక్షణాలున్న వారిని గుర్తించాలని ఐసీడీ ఎస్‌ పీడీ ఝాన్సీ అన్నారు. గంగారాం తండా పరిధిలో కొనసాగుతున్న ఇం టింటి ఆరోగ్య సర్వేను మంగళవారం సీడీపీవో సునితతో కలిసి పరిశీలించారు. లోలం, ఎల్లారెడ్డిపల్లి, వెంగల్‌పహాడ్‌, తిర్మన్‌పల్లి గ్రామాల్లో కొనసాగుతున్న సర్వేను ఎంపీడీవో రాములునాయక్‌ పరిశీలించారు.
పకడ్బందీగా నిర్వహించాలి
ముప్కాల్‌: సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో దామోదర్‌ అన్నారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో మంగళవారం రెం డోవిడత ఇంటింటిసర్వే నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ మా రుతి, ఏఎన్‌ఎం సుకన్య, పద్మ, వసంత, అమీనా పాల్గొన్నారు.
పట్టణంలో ఇంటింటి సర్వే
పెర్కిట్‌: ఆర్మూర్‌ పట్టణంలోని 32వార్డులో మంగళవారం ఇంటింటి స ర్వే నిర్వహించారు. 10 తర్వాత ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని సిబ్బంది సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
సర్వేను పరిశీలించిన జిల్లా అధికారులు
మోర్తాడ్‌: మండలంలోని సర్వేను జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ న వీన్‌చంద్ర, ఇతర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. సర్వేను పకడ్భందీగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మోర్తాడ్‌ ఎక్సైజ్‌ సీఐ శేఖర్‌, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
పలు గ్రామాల్లో..
వేల్పూర్‌: మండలంలోని పలు గ్రామాలలో ఆరోగ్యసర్వే రెండోవిడత మంగళవారం ప్రారంభమైంది. సిబ్బంది ఇంటింటికీ వివరాలు సేకరిస్తున్నా రు. సెకండ్‌వే తీవ్రంగా ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అశోక్‌, వెంకటరమణ తెలిపారు. కరోనా లక్షణాలున్న వారిని గురించి ధైర్యం చెప్పి హోంక్వారంటైన్‌లో ఉంటూ మందులు వాడే విధంగా అవగాహన కల్పిం చారు. జాన్కంపేట్‌లో సిబ్బంది టీంలుగా ఏర్పడి సర్వేను నిర్వహించారు. సర్వేను సర్పంచ్‌ సౌడ ప్రేమలత రమేష్‌ పర్యవేక్షించారు.
12 బృందాల ఆధ్వర్యంలో
భీమ్‌గల్‌: పట్టణంలో మంగళవారం 12బృందాల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. వ్యాధి లక్షణాలు ఉంటే గుర్తించాలన్నారు.
కిట్‌ల అందజేత
ఆర్మూర్‌టౌన్‌: పలు వార్డుల్లో సిబ్బంది సర్వే నిర్వహించారు. లక్షణాలు ఉన్న వారికి మెడికల్‌ కిట్టును అందజేశారు. కార్యక్రమంలో మెప్మాసీవో రా జలింగం, అంగన్‌వాడీ టీచర్‌లు పద్మ, ఏఎన్‌ ఎం రాజవ్వ, కమల, విజయ, తదితరులు పాల్గొన్నారు.
పలు గ్రామాల్లో పరిశీలన
మోపాల్‌, మే 18: ముదక్‌పల్లి, సిర్నాపల్లి గ్రామాల్లో సర్వేను మండల ప్రత్యేక అధికారి రవికుమార్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దా ర్‌ వీర్‌సింగ్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-19T05:25:54+05:30 IST