ఆ ఇద్దరు.. 500లపైనే పాస్‌పోర్టులు
ABN , First Publish Date - 2021-02-27T04:52:46+05:30 IST
ఆ ఇద్దరు.. 500ల పైనే పాస్‌పోర్టులు.. అవన్నీ సక్రమం గా ఉన్నాయా లేదా? వాటిలో దొంగ పాస్‌పోర్టులు ఏమైనా ఉన్నాయా? ఇదీ ప్రస్తుతం పోలీసు శాఖలో మెదులుతున్న ప్రశ్న. బోధన్‌లో ఎస్‌బీ అధికారుల అక్రమతంతుతో 70కి పైగా నకిలీ పాస్‌పోర్టులు వెలుగుచూడడం.. అందులో రో హింగ్యాలకు కొన్ని జారీ కావడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

బోధన్‌లో ఇద్దరు ఎస్‌బీ సిబ్బంది కాలంలో జారీ అయిన పాస్‌పోర్టులపై రీ ఎంక్వైయిరీ
వారి కాలంలో 500లకు పైగా పాస్‌పోర్టులు జారీ అయినట్టు గుర్తించిన అధికారులు
ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక బృందాలతో తనిఖీలు
అప్రమత్తమైన పోలీసు శాఖ
బోధన్, ఫిబ్రవరి 26: ఆ ఇద్దరు.. 500ల పైనే పాస్‌పోర్టులు.. అవన్నీ సక్రమం గా ఉన్నాయా లేదా? వాటిలో దొంగ పాస్‌పోర్టులు ఏమైనా ఉన్నాయా? ఇదీ ప్రస్తుతం పోలీసు శాఖలో మెదులుతున్న ప్రశ్న. బోధన్‌లో ఎస్‌బీ అధికారుల అక్రమతంతుతో 70కి పైగా నకిలీ పాస్‌పోర్టులు వెలుగుచూడడం.. అందులో రో హింగ్యాలకు కొన్ని జారీ కావడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బోధన్‌లో నకిలీ పాస్‌పోర్టుల వ్యవ హారం పోలీసుశాఖను కుదిపేస్తోంది. ఈ వ్యవహారం ఇప్ప టికే రాజకీయ రంగును పులుముకోగా పోలీసుశాఖ ఈ వ్యవహారంలో మరింత లోతుగా సమగ్రంగా దర్యాప్తు చేప ట్టేందుకు పూనుకుంది. ఇందులో భాగంగానే ఆ ఇద్దరు ఎస్‌బీ సిబ్బంది కాలంలో జారీ అయిన పాస్‌పోర్టులపై ప్ర త్యేక దృష్టి పెట్టింది. నిన్నామొన్నటి వరకు నకిలీ పాస్‌పో ర్టుల పైనే దృష్టిసారించిన పోలీసుశాఖ ఇప్పుడు ఏకంగా ఆ ఇద్దరు ఎస్‌బీ అధికారులు బోధన్‌లో విధులు చేపట్టిన కాలంలో ఎన్ని పాస్‌పోర్టులు జారీ అయ్యాయి? ఎక్కడెక్క డ జారీ అయ్యాయి? ఎవరెవరికి ఇచ్చారు? అన్న లోతైనా విచారణ మొదలైంది.
ఇద్దరి కాలంలో ఐదు వందలకు పైగా జారీ
ఎస్‌బీ ఎస్సై మల్లేష్, హెడ్ కానిస్టేబుల్ అనిల్ బోధన్ లో 2016 నుంచి 2021 వరకు ఎస్‌బీలో విధులు నిర్వహిం చారు. వీరిద్దరూ దాదాపు ఐదేళ్ల కాలం పాటు బోధన్‌లో ఎస్‌బీలో విధులు నిర్వహించి కొత్త పాస్‌పోర్టులను జారీ చేసే ప్రక్రియలో కీలక భూమిక పోషించారు. ఈ ఇద్దరి ద ర్యాప్తుతోనే కొత్త పాస్‌పోర్టులు వందల సంఖ్యలో జారీ అ య్యాయి. దాదాపు ఐదు వందలకు పైనే వీరి ఇద్దరి విధు ల కాలంలో పాస్‌పోర్టులు జారీ అయినట్లు అధికారులు గుర్తించారు. వీటన్నింటినీ మండలాల వారీగా, గ్రామాల వారీగా వివరాలు సేకరించి ఎవరెవరి పేరిట పాస్‌పోర్టులు జారీ అయ్యాయి? ఏఏ ఇంటి నెంబర్లపై జారీ అయ్యాయి అన్నది విచారణ ప్రారంభించారు. పోలీసుశాఖ ఉన్నత అ ధికారులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టి తిరిగి ద ర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఇద్దరి కాలంలో సుమారు ఐదు వందల పైనే పా స్‌పోర్టులు జారీ అయిన ట్లు ప్రాథమికంగా అధికా రులు అంచనాకు వచ్చారు. అయితే ఈ ఐదు వందల పాస్‌పోర్టులు నకిలీవా? అస లువా? అన్నది తేలాల్సి ఉం ది. వీటిలో ఎన్ని నకిలీ పాస్ పోర్టులు ఉన్నాయి? అన్న కోణ ంలో పోలీసులు విచారణ పెట్టా రు. ఇంటింటికీ వెళ్లి విచారణ చే సే పనిని ప్రారంభించారు.
ప్రత్యేక బృందాలతో రీ ఎంక్వైయిరీ
మల్లేష్, అనిల్ జారీ చేసిన పాస్‌పో ర్టులపై రీ ఎంక్వై యిరీ మొదలైంది. ఈ ఇద్దరి కాలంలో సుమారు ఐదు వందల పైనే పాస్‌పోర్టు లు జారీ అయ్యాయని గుర్తించిన పోలీసు శాఖ అధికారులు అవి ఎక్కడెక్కడ జారీ అయ్యాయనే అంశంపై లోతుగా విచారణ మొదలుపెట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేసిన పోలీసు ఉన్నత అధికారులు రీ ఎంక్వైయిరీ ప్రక్రియను ప్రారంభించారు. అ యితే, ఈ విచారణలో మళ్లీ ఎన్ని నకిలీ పాస్ పోర్టులు వెలుగుచూస్తాయన్నది సందేహాస్పద ంగా మారింది. మొత్తమ్మీద పాస్‌పోర్టుల రీ ఎం క్వైరీ ప్రక్రియ సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఆ ఇద్దరి కాలంలో పాస్‌పోర్టులు పొందిన వారి ఇంటికి ప్రత్యేక బృందాలు వెళ్తుండడంతో అలజడి మొదలైం ది. ఇళ్లకు వెళ్లి విచారణ జరుపుతుండడంతో సక్రమం గా పాస్ పోర్టులు పొందిన వారిలో కూడా ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా ఆ ఇద్దరు ఎస్‌బీ సిబ్బంది తమ ఇళ్ల అడ్రస్‌లు ఇంకెవరికైనా ఇచ్చారా? అని ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు.