నాలుగు ఇళ్లల్లో చోరీ

ABN , First Publish Date - 2021-08-27T05:34:40+05:30 IST

మండలంలోని కొండూర గ్రామంలో బుధవారం రాత్రి తాళం వేసిన నాలుగు ఇళ్లల్లో దొంగలు పడి నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు ఎస్సై ఎం. రాజశేఖర్‌ తెలిపారు.

నాలుగు ఇళ్లల్లో చోరీ


సిరికొండ ఆగస్టు 26: మండలంలోని కొండూర గ్రామంలో బుధవారం రాత్రి తాళం వేసిన నాలుగు ఇళ్లల్లో దొంగలు పడి నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు ఎస్సై ఎం. రాజశేఖర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తాళం వేసిన ఇళ్లను ఎంచుకున్న దొంగలు దారవోయిన సత్తెవ్వ ఇంట్లో చొరబడిన మూడున్నర తులాల బంగారం కొంత నగదును ఎత్తుకెళ్లారు. సితాయిపేట్‌ సంతోష్‌ ఇంట్లో తులంన్నర బంగారంతో పాటు సుమారు రూ.25వేలపై చిలుకు నగదును ఎత్తుకెళ్లారు. బసాయి లాస్య ఇంటి తాళాలు పగుల గొట్టి బంగారం ఎత్తుకెళ్లాని చెప్పారు. సంఘటన జరిగిన ఇళ్లకు వెళ్లిన క్లూస్‌ టీం ఆదారాలను సేకరించింది. ఎస్సై రాజశేఖర్‌ ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-08-27T05:34:40+05:30 IST