తాళం వేసిన ఇంట్లో దొంగతనం

ABN , First Publish Date - 2021-10-20T04:36:26+05:30 IST

జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న రామారెడ్డి మండలం కన్నాపూర్‌ గ్రామానికి చెందిన రాంరెడ్డి ఇంట్లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు.

తాళం వేసిన ఇంట్లో దొంగతనం
డాగ్‌ స్క్వాడ్‌తో పరిశీలిస్తున్న పోలీసులు

10 తులాల బంగారు నగలు, లక్ష నగదు చోరీ
కామారెడ్డి, అక్టోబరు 19: జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న రామారెడ్డి మండలం కన్నాపూర్‌ గ్రామానికి చెందిన రాంరెడ్డి ఇంట్లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. కామారెడ్డి ఎస్‌హెచ్‌వో కథనం ప్రకారం.. కామారెడ్డి అశోక్‌నగర్‌ కాలనీలో నివాసం ఉండే రాంరెడ్డి తన ఇంటికి తాళం వేసి దసరా పండుగ సందర్భంగా స్వగ్రామమైన కన్నాపూర్‌కు వెళ్లారు. అదను గా భావించిన దుండగులు రాత్రి సమయంలో తాళం వేసి ఉన్న ఇంటి తాళంను పగులగొట్టి ఇంట్లో ఉన్న బీరువా నుంచి పది తులాల బంగారు నగలు, లక్ష నగదు దోచుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. రాంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

Updated Date - 2021-10-20T04:36:26+05:30 IST