నాగిరెడ్డిపేట రామాలయంలో చోరీ

ABN , First Publish Date - 2021-11-02T05:40:01+05:30 IST

మండల కేంద్రంలోని రామాలయం లో ఆదివారం రాత్రి గుర్తు తెలియ ని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీని పగులగొట్టి డబ్బులను ఎత్తుకెళ్లారు.

నాగిరెడ్డిపేట రామాలయంలో చోరీ

నాగిరెడ్డి పేట, నవంబరు 1: మండల కేంద్రంలోని రామాలయం లో ఆదివారం రాత్రి గుర్తు తెలియ ని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీని పగులగొట్టి డబ్బులను ఎత్తుకెళ్లారు. ఆదివారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న రామాలయంలో గేటు తెరుచుకుని లోనికి ప్రవేశించా రు. ఆలయం లోపల ఉన్న హుండీ ని పగుల గొట్టి డబ్బుల్ని హుండీలో ఉన్న వస్తువులను దొంగిలించి పరారయ్యారు. ఆలయ నిర్వాహకు లు ఉదయం చూసేసరికి హుండీని పగుల గొట్టి డబ్బులు ఎత్తుకు పోయిన విషయాన్ని తెలుసుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చోరీ దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-02T05:40:01+05:30 IST