ధర్పల్లిలో పెట్రోల్‌ బంకులో చోరీ

ABN , First Publish Date - 2021-12-30T06:48:33+05:30 IST

మండల కేంద్రలోని ఓ పెట్రోల్‌ బంకులో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బంకు వెనకాల నుంచి సుమారు పది మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పెట్రోలు బంకు సిబ్బందిపై దాడి చేశారు.

ధర్పల్లిలో పెట్రోల్‌ బంకులో చోరీ

ధర్పల్లి, డిసెంబరు 29: మండల కేంద్రలోని ఓ పెట్రోల్‌ బంకులో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బంకు వెనకాల నుంచి సుమారు పది మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పెట్రోలు బంకు సిబ్బందిపై దాడి చేశారు. బంకులోని క్యాష్‌ కౌంటర్‌ను ఎత్తుకెళ్లారు. కౌంటర్‌లో రూ.67 వేలు ఉన్నట్టు సిబ్బంది తెలిపారు. బంకును ఏసీపీ వెంకట్శేర్లు, సీఐ శ్రీశైలం, ఎస్సై మురళి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-12-30T06:48:33+05:30 IST