యువత దేశభక్తిని పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2021-10-30T05:14:53+05:30 IST

యువత దేశ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని బోధన్‌ ఏసీపీ రామారావు పిలుపునిచ్చారు.

యువత దేశభక్తిని పెంపొందించుకోవాలి

బోధన్‌రూరల్‌, అక్టోబరు 29 : యువత దేశ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని బోధన్‌ ఏసీపీ రామారావు పిలుపునిచ్చారు. శుక్రవారం బోధన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్‌ అవుట్‌ రీచ్‌ బ్యూరో నిజామాబాద్‌ యూనిట్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాతీయ ఐక్యతా దినోత్సవం(రాష్ట్రీయ ఏక్తా దివస్‌) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాల నుంచి ప్రస్తుత యువత స్ఫూర్తి పొంది దేశాభివృద్ధిలో తమవంతు పాత్ర పోషించాలన్నారు. అనంతరం ఏసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వీరప్రసాద్‌, విజయ్‌కుమార్‌, రాహుల్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T05:14:53+05:30 IST