అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి

ABN , First Publish Date - 2021-08-28T04:57:10+05:30 IST

రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు.

అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి

మాజీ మంత్రి షబ్బీర్‌అలీ

కామారెడ్డి, ఆగస్టు 27: రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ ప్రజలకు చెబుతున్న మాయమాటలు, గారడీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని అందుకోసం తాయిలాలు ఇస్తూ వారిని మభ్య పెట్టేందుకు చూస్తున్నారని అన్నారు. తాజాగా హుజురాబాద్‌ ఉప ఎన్నిక కోసం దళితబంధు అంటూ ఒక పథకం పెట్టి ఒక నియోజకవర్గానికే రూ.2000 కోట్ల నిధులు ప్రకటించారని తెలిపారు. ఎంత చేసినా కేసీఆర్‌ ప్రభుత్వంపై దళిత, గిరిజనులలో వ్యతిరేకత ఉందని అన్నారు. త్వరలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు భారీగా కాంగ్రెస్‌లో చేరుతారని తెలిపారు. కాగా మాచారెడ్డి మండలం రత్నగిరి పల్లెకు చెందిన 100 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T04:57:10+05:30 IST