రైతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2021-03-22T05:41:51+05:30 IST

వ్యవసాయపరంగా రైతుల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు జుక్కల్‌ ఎమ్మెల్యే హ న్మంత్‌ షిండే అన్నారు.

రైతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం


బిచ్కుంద,మార్చి 21: వ్యవసాయపరంగా రైతుల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు జుక్కల్‌ ఎమ్మెల్యే హ న్మంత్‌ షిండే అన్నారు. మండలంలోని గుండెనెమిలి, సీతారాం పల్లి, సిరిసముద్రం, హస్గుల్‌, మిషన్‌ కల్లలి గ్రామాల్లో నూత నంగా నిర్మాణమైన రైతువేదికలు, వైకుంఠధామాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయపంగా రైతులు అందరూ కలిసి ఒక్కచోట కుర్చోని చ ర్చించుకునే విధంగా రైతువేదికలు ఉపయోగపడుతాయని తెలి పారు. రైతుల్లో ఐకమత్యం కూడా పెరుగుతుందని వివరించారు. ప్రతీ గ్రామంలోని శ్మశానవాటికలలో, వైకుంఠధామాలను రాష్ట్రప్రభుత్వం నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రజాసంక్షేమ పథకాలు దేశంలోని ఏరాష్ట్రంలో కూడా అమలులో లేవని గుర్తుచేశారు. ప్రతిపక్ష పార్టీల నాయ కులు ప్రజలను తప్పుదో పట్టించేందుకు పూర్తిగా అసత్యాలు మా ట్లాడుతున్నారని అన్నారు. ఏడాదిగా రాష్ట్రంలో కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నా ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ఎంపీపీ అశోక్‌పటేల్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకటరావుదేశాయ్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ రాజు, మండల రైతుల సమన్వయ సమితి అధ్యక్షుడు బస్వరాజుపటేల్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-22T05:41:51+05:30 IST