నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-10-30T05:20:28+05:30 IST

డైట్‌ కళాశాలల్లోని నియామకాల్లో నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలి టీఎన్‌ఎస్‌ఎప్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు తెలిపారు. శుక్రవారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట టీఎన్‌ఎస్‌ఎప్‌, బీసీ యువజన, తెలంగాణ జనసమితి, ఎస్‌ఎప్‌ఐ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ దిష్టి బొమ్మను దహనం చేశారు.

నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలి

కామారెడ్డిటౌన్‌, అక్టోబరు 29: డైట్‌ కళాశాలల్లోని నియామకాల్లో నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలి టీఎన్‌ఎస్‌ఎప్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు తెలిపారు. శుక్రవారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట  టీఎన్‌ఎస్‌ఎప్‌, బీసీ యువజన, తెలంగాణ జనసమితి, ఎస్‌ఎప్‌ఐ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డైట్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల నియామకాల కోసం పదవీ విరమణ పొందిన అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు మాత్రమే అవకాశాన్ని కల్పించడం ఎంటని ప్రశ్నించారు. ఒకవైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే, వారికి ఉద్యోగాలను కల్పించాల్సిన ప్రభుత్వం వేదింపులకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచడమే కాకుండా నిరుద్యోగులకు డైట్‌కళాశాలలో అవకాశాన్ని కల్పించకపోవడం చూస్తేనే నిరుద్యోగులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఎంతమేర చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు కుంబాల లక్ష్మణ్‌ యాదవ్‌, స్వామి, అజయ్‌, కిరణ్‌, రాజు, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T05:20:28+05:30 IST