భవానీపేటలో బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం ధ్వంసం

ABN , First Publish Date - 2021-03-15T04:25:31+05:30 IST

మండలంలోని భవానీపేటలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం ముఖం భాగాన్ని, పాదాలను ధ్వంసం చేశారు.

భవానీపేటలో బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం ధ్వంసం
ధ్వంసమైన జగ్జీవన్‌రామ్‌ విగ్రహం

లింగంపేట, మార్చి 14: మండలంలోని భవానీపేటలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం ముఖం భాగాన్ని, పాదాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీ ఎస్‌ నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బల్‌రాం ఆధ్వర్యంలో నాయకులు లింగంపేట మండ ల కేంద్రంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బల్‌రాం మాట్లాడుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను త్వరగా పట్టుకోకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమా న్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. విగ్రహాన్ని గతనెల 6న ఆవిష్కరించగా కేవలం 40రోజుల వ్యవధిలోనే విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశా రు. దీనిపై ఎస్సై శ్రీకాంత్‌ త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వారికి హామీ ఇచ్చా రు. దీంతో వారు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కోటగిరి శంకర్‌, జిల్లా అధ్యక్షుడు సుంకరి శ్రీనివాస్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు బట్టు శామల, రాష్ట్ర కార్యదర్శి సత్త్యక్కలతో పాటు సాయిరాం, పద్మరాజు, సాయిలు, ఎమ్మార్పీ ఎస్‌ నాయకులు ఉన్నారు.
విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
ఎల్లారెడ్డి: లింగంపేట మండలం భవానీపేట్‌లో బాబు జగ్జీవన్‌రాయ్‌ విగ్రహం ధ్వం సం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర సెక్రెటరీ కత్తి పద్మారావు అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి డీఎస్‌పీ శశాంక్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం ధఽ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయ కులు బాలయ్య, ఆగమయ్య, సాయిబాబు, రజాక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-15T04:25:31+05:30 IST