సిద్ధరామేశ్వర ఆలయం ఎంతో మహిమ కలది

ABN , First Publish Date - 2021-08-26T05:06:13+05:30 IST

మండలకేంద్రంలోని దక్షిణకాశీగా బాసీల్లుతున్న సిద్ధర మేశ్వర ఆలయం ఎంతో మహిమ కలదని విజయవాడ శివవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామిజీ అన్నారు.

సిద్ధరామేశ్వర ఆలయం ఎంతో మహిమ కలది

  విజయవాడ శివక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

భిక్కనూరు. ఆగష్టు 25: మండలకేంద్రంలోని దక్షిణకాశీగా బాసీల్లుతున్న సిద్ధర మేశ్వర ఆలయం ఎంతో మహిమ కలదని విజయవాడ శివవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామిజీ అన్నారు. బుధవారం సిద్ధరామేశ్వర ఆలయాన్ని శివస్వామిజీ దర్శించుకు ని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి మాట్లాడు తూ స్వయంభూ సిద్ధరామేశ్వర స్వామిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృత మనిన్నారు. ఆలయ కమిటీ, ఆలయ అర్చకులు సన్మానించి స్వామివారి చిత్రపటా న్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌ వేణు, ఆలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు, నాయకులు పాల్గొన్నారు.

  అశోకసుందరి సహిత గణపతి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

సిద్ధరామేశ్వర ఆలయ ప్రాంగణంలోని నిత్యాన్నదాన సత్రంలో అశోక సుందరి సహిత గణపతి, సుబ్రమణ్యేశ్వర స్వామి, నగరేశ్వర సహిత వాసవీ కన్యాక పరమే శ్వరి దేవాలయాల నిర్మాణానికి శివస్వామిజీ చేతుల మీదుగా భూమిపూజ కార్యక్ర మాన్ని నిర్వహించారు. శివస్వామిజీ, ఆంజనేయశర్మ వేదమంత్రోచ్ఛరణల నడుమ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్రం అధ్యక్షుడు రాములు, కోశాధికారి వెంకటే షం, కార్యదర్శి శ్రావణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-26T05:06:13+05:30 IST