పసుపు ధర పెరుగుతోంది!

ABN , First Publish Date - 2021-02-06T04:56:56+05:30 IST

నిజామాబాద్‌ మార్కెట్‌లో పసుపు ధర కొద్దిగా పెరిగింది. గత నెలతో పో లిస్తే గడిచిన రెండు రోజులుగా ధర పెరుగుతోంది. మహారాష్ట్రతో పాటు ఇత ర రాష్ట్రాల్లో కూడా పసుపు ధర పెరుగుతుండడంతో జిల్లాలో కూడా పెరిగిం ది. పసుపు ఎగుమతులు పెరగడం వల్ల ధర పెరుగుతోంది.

పసుపు ధర పెరుగుతోంది!
శుక్రవారం నిజామాబాద్‌ మార్కెట్‌కు వచ్చిన పసుపు

నిజామాబాద్‌ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన పసుపు ధర

శుక్రవారం రూ.6,868 పలికిన క్వింటాలు పసుపు 

వచ్చేవారం మార్కెట్‌కు  పసుపు భారీగా వస్తుందని అంచనా


నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ మార్కెట్‌లో పసుపు ధర కొద్దిగా పెరిగింది. గత నెలతో పో లిస్తే గడిచిన రెండు రోజులుగా ధర పెరుగుతోంది. మహారాష్ట్రతో పాటు ఇత ర రాష్ట్రాల్లో కూడా పసుపు ధర పెరుగుతుండడంతో జిల్లాలో కూడా పెరిగిం ది. పసుపు ఎగుమతులు పెరగడం వల్ల ధర పెరుగుతోంది. ఇతర దేశాల నుంచి డిమాండ్‌ పెరుగుతుండడంతో వ్యాపారులు కూడా ధర పెంచి కొనుగోలు చేస్తున్నారు. దర కొద్దికొద్దిగా పెరుగుతుండడంతో రైతులు కూడా పసు పు ఉత్పత్తులను ఎక్కువగా మార్కెట్‌కు తీసుకువస్తున్నారు.


నిజామాబాద్‌ మార్కెట్‌కు గడిచిన 20రోజులుగా కొత్త పసుపు వస్తోంది. శుక్రవారం కూడా 10వేల బస్తాలకు పైగా పసుపు వచ్చింది. ఈనెల ప్రారంభం నుంచి పసుపు ధర కొద్దికొద్దిగా పెరుగుతోంది. గత నెలలో క్వింటాలు పసుపు రూ.6వేల లో పే అమ్మకాలు జరగగా ఈ నెలలో మాత్రం రూ.7వేల వరకు చేరుకుంది. కని ష్ట ధర క్వింటాలుకు రూ.4,500లు ఉండగా గరిష్ట ధర రూ.6,868లు పలికిం ది. మోడల్‌ ధర క్వింటాలుకు రూ.5,858పలికింది. క్వింటాలు ధర పెరిగిన ఎ క్కువగా రూ.5వేల నుంచి రూ.6వేల మధ్య ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. ఈ మార్కెట్‌లో గురువారం క్వింటాలుకు రూ.7,100 ధర వచ్చింది.


మహారాష్ట్రలోనూ సాంగ్లి మార్కెట్‌లో క్వింటాల్‌ ధర రూ.6వేల నుంచి రూ.7,500 మ ధ్యన అమ్మకాలు జరుగుతున్నాయి. జిల్లాలోని రైతులు కొంతమంది సాంగ్లీ మార్కెట్‌కు తీసుకువెళ్లి అమ్మకాలు చేస్తుండడంతో నిజామాబాద్‌ మార్కెట్‌ లో కూడా ఈ ధర పెరుగుతోంది. బయటి దేశాల నుంచి దిగుమతి నిలిపివేయడం, ఎగుమతులను ప్రోత్సహించడం వల్ల ధర పెరుగుతోందని వ్యాపార వర్గాలు తెలిపాయి. జిల్లాలో ధర కొద్దికొద్దిగా పెరుగుతుండటంతో రైతులు కూడా తమ ఉత్పత్తులను అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. కొత్త ఉత్ప త్తులను మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే పసుపు మార్కెట్‌కు తక్కువగా వస్తున్న ధర పెరుగుతుండడంతో వచ్చేవారు భారీగా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


పసుపు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పసుపు ధర గడిచిన రెండు రోజులుగా కొంత మేర పెరిగిందని మార్కెటింగ్‌ శాఖ ఏడీ గంగు తెలిపారు. ఇతర మార్కెట్లలో కూడా రేటు పెరుగుతోందని ఆమె అన్నారు. నిజామాబాద్‌ మార్కెట్‌లో రైతులకు ధర వచ్చే విధంగా చూస్తున్నామని తెలిపారు. ఈ-నామ్‌ ద్వారా క్రయవిక్రయాలు జరుపుతున్నామని ఆమె తెలిపారు. 

Updated Date - 2021-02-06T04:56:56+05:30 IST