కరోనాతో వృద్ధుడి మృతి
ABN , First Publish Date - 2021-03-21T06:01:39+05:30 IST
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో శనివారం కరో నాతో ఓ వృద్ధుడు (69) మృతిచెందాడు.

బాన్సువాడ, మార్చి 20: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో శనివారం కరో నాతో ఓ వృద్ధుడు (69) మృతిచెందాడు. రెండు రోజుల క్రితం వృద్ధుడికి దగ్గు ఎక్కువగా ఉండటంతో.. చికిత్స నిమిత్తం మహారాష్ట్రలోని దెగ్లూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం తో.. తిరిగి జుక్కల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడం తో.. శనివారం మృతి చెందాడు. దీంతో స్వగ్రామంలో పోలీస్, వైద్య సిబ్బంది సమ క్షంలో వృద్ధుడి అంత్యక్రియలు నిర్వహించారు.