నేడు విధుల్లో చేరనున్న నూతన సీపీ

ABN , First Publish Date - 2021-12-26T05:41:41+05:30 IST

నిజామాబాద్‌ నూతన పోలీస్‌ కమిషనర్‌గా కేఆర్‌.నాగరాజు ఆదివారం విధుల్లో చేరనున్నారు. ప్రస్తుత సీపీగా ఉన్న కార్తికేయ నుంచి బాధ్యతలను స్వీకరించనున్నారు.

నేడు విధుల్లో చేరనున్న నూతన సీపీ

ఖిల్లా, డిసెంబరు 25: నిజామాబాద్‌ నూతన పోలీస్‌ కమిషనర్‌గా కేఆర్‌.నాగరాజు ఆదివారం విధుల్లో చేరనున్నారు. ప్రస్తుత సీపీగా ఉన్న కార్తికేయ నుంచి బాధ్యతలను స్వీకరించనున్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లికి చెందిన నాగరాజు ఎస్సైగా పోలీసు సర్వీసులో 1989లో చేరారు. 30 ఏళ్ల సర్వీసులో వరంగల్‌, కరీంనగర్‌తో పాటు ఇతర జిల్లాల్లో పనిచేశారు. నక్సల్‌ ఆపరేషన్‌లో కీలక అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. రెండేళ్ల క్రితం మెదక్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల విజిలెన్స్‌ ఎస్పీగా పనిచేశారు. కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన ఆయనకు నాలుగు రోజుల క్రితమే ఆయనకు ఐపీఎస్‌ హోదా వచ్చింది. రాష్ట్రస్థాయిలో జరిగిన బదిలీల్లో భాగంగా ఆయనను నిజామాబాద్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు.

Updated Date - 2021-12-26T05:41:41+05:30 IST