పల్లెలకు ప్రకృతి అందాలు.. ప్రతీ గ్రామానికి ఒక చిట్టడివి
ABN , First Publish Date - 2021-01-04T05:20:44+05:30 IST
గ్రామాల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనా లు గ్రామాలకు అందాలను తెస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతున్నాయి.
ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనాలు
మెండోర, జనవరి 3: గ్రామాల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనా లు గ్రామాలకు అందాలను తెస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతున్నాయి. మండలంలో గ్రామాల్లో ఈ ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. అందులో వివిధ రకాల మొక్కలను నాటారు. దీంతో మొక్కలు పచ్చగా కళకళలాడుతున్నాయి. ఎకర భూమిలో ఒక పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి వనంలో నాలుగు వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా చేసుకొని నాటారు. ఇప్పటి వరకు దాదాపు అన్ని గ్రామాల్లో మొక్కలను నాటినట్లు సర్పంచ్‌లు తెలిపారు. ఈ వనాల్లో వేప, మర్రి, చింత, టేకు, నేరేడుతో పాటు పూల మొక్కలను పెంచుతున్నారు. మొక్కల పోషణను ఉపాధి హామీ కూలీలు చూస్తున్నారు.
మంత్రి, కలెక్టర్ సహకారంతో..
మండల కేంద్రంలో పల్లె ప్రకృతి వనాన్ని గ్రామ సర్పంచ్ మచ్చర్ల లక్ష్మీరాజారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొ ని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి సహకారంతో పల్లె ప్రకృతి వనాన్ని సుందరం గా తీర్చిదిద్దారు. గ్రామంలో ఎకరం రెండు గుంటల భూమిలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశా రు. కలెక్టర్ స్వయంగా మండల కేంద్రానికి వచ్చి పల్లె ప్రకృతి వనం నిర్మించే స్థలాన్ని పరిశీలించి మండల కేంద్రంలో ఇదే సరైన స్థలమని ఇక్కడే నిర్మించాలని సర్పంచ్‌ను ఆదేశించారు. సర్పంచ్ పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి బడ్జెట్ సరిపోవడంలేదని కలెక్టర్‌కు విన్నవించ డంతో కలెక్టర్ తక్షణమే రూ.2లక్షలు తన బడ్జెట్ నుంచి నిధులు మంజూరు చేశారు. దీంతో నేడు పల్లె ప్రకృతి వనం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సంతరించుకుంది.
ప్రతీ గ్రామానికి ఒక చిట్టడవి
ప్రతీ గ్రామంలో ఒక చిన్నపాటి చిట్టడవి ఏర్పాటు చేయడ మే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకోవడంతో గ్రామాల్లో ప్రకృతి వనాలు పూర్తయ్యాయి. జిల్లా అధికారులు, మం డల అధికారులు మండల ప్రజా ప్రతినిధులతో పాటు గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజల సమిష్ఠి కృషితో వనాలను పూర్తి చేశారు. వీటి ద్వారా రానున్న రోజుల్లో గ్రామాల్లో మంచి వాతావరణం ఏర్పడుతుందని గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.