చెరవులో పడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-01-01T05:18:49+05:30 IST
మండల కేంద్రంలోని మారెడి చెరువులో ఓ వ్యక్తి పడి మృతి చెందినట్లు ఎస్సై రంజిత్ తెలిపారు. శుక్రవారం శవాన్ని ఎస్సై రంజిత్ వెలికితీయించారు.

పిట్లం, డిసెంబరు 31: మండల కేంద్రంలోని మారెడి చెరువులో ఓ వ్యక్తి పడి మృతి చెందినట్లు ఎస్సై రంజిత్ తెలిపారు. శుక్రవారం శవాన్ని ఎస్సై రంజిత్ వెలికితీయించారు. పిట్లం గ్రామానికి చెందిన బాలరాజు(40)గా గుర్తించారు. మృతుడి భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
చేపల వలకు చిక్కుకుని..
బీబీపేట: మండలంలోని శివార్ రాంరెడ్డిపల్లె గ్రామానికి చెందిన దోమకొండ ఎల్లయ్య(49) చేపల వలకు చిక్కుకుని మృతి చెందాడు. ఎస్‌ఐ మ హేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం ఎగువ మానేరులో చేపలు పట్టడానికి ఎల్లయ్య వెళ్లాడు. చేపల వల కాళ్లకు, శరీరానికి చుట్టుకోవడంతో నీటిలో మునిగిపోయాడు. మృతుడి భార్య శోభ ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి, మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.