ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-08-26T05:12:01+05:30 IST
రెంజల్ మండల కేంద్రంలో బొబ్బిలి శ్రీకాంత్(35)అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మురళి తెలిపారు.

బోధన్, ఆగస్టు 25 : రెంజల్ మండల కేంద్రంలో బొబ్బిలి శ్రీకాంత్(35)అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మురళి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాంత్ బతుకు దెరువు కోసం పదేళ్ల క్రితం నిజామా బాద్ నుంచి రెంజల్‌కు వచ్చి ఉంటున్నాడు. మద్యానికి బానిసైన శ్రీకాంత్ అప్పుల పాలయ్యాడు. రెండు రోజుల క్రితం భార్యతో గొడవ పడ్డాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. శ్రీకాంత్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.