ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-02-07T04:54:29+05:30 IST

మండలంలోని కోస్లీ శివారులో కమ్మర్‌పల్లి గంగారాం (59) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ యాకూబ్‌ తెలిపారు.

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

నవీపేట, ఫిబ్రవరి 6: మండలంలోని కోస్లీ శివారులో కమ్మర్‌పల్లి గంగారాం (59) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ యాకూబ్‌ తెలిపారు. మండలంలోని నాగేపూర్‌కు చెందిన గంగారాం గత నెల 30న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మానసిక స్థితి బాగొలేదని, గంగారాం మృతి చెంది సుమా రు ఆరు రోజులు అవుతుంద న్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిందని ఎస్‌ఐ తెలిపారు. మృతుడి కుమారుడు సంజయ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-02-07T04:54:29+05:30 IST