బీఎస్పీలో పలువురు నాయకుల చేరిక

ABN , First Publish Date - 2021-10-30T04:55:46+05:30 IST

మద్నూర్‌ మండల కేంద్రంలో జరిగిన రాజ్యాధి కార సాధనకై బహుజన యుద్ధభేరీ కార్యక్రమంలో రాష్ట్ర బీఎస్పీ కో ఆర్డినే టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో మండలానికి చెందిన పలువురు నాయకులు బహుజన్‌ సమాజ్‌ పార్టీలో చేరారు.

బీఎస్పీలో పలువురు నాయకుల చేరిక
అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

మద్నూర్‌, అక్టోబరు 29: మద్నూర్‌ మండల కేంద్రంలో జరిగిన రాజ్యాధి కార సాధనకై బహుజన యుద్ధభేరీ కార్యక్రమంలో రాష్ట్ర బీఎస్పీ కో ఆర్డినే టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో మండలానికి చెందిన పలువురు నాయకులు బహుజన్‌ సమాజ్‌ పార్టీలో చేరారు. వారికి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కండువా కప్పి బహుజన్‌ సమాజ్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఆంజ నేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్‌ అనిల్‌ పటేల్‌, మాజీ ఎంపీటీసీ కర్రె వార్‌ రాములు, మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్‌, రాష్ట్ర గౌడ సంఘం నాయ కులు సురేష్‌గౌడ్‌, మండల నాయకులు రాజు, గోపి, తదితరులు బహుజన్‌ సమాజ్‌ పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలోని మైథిలి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన బహుజన సమాజ్‌ పార్టీ సమావేశంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో మూడు సార్లు ఎన్నికైన ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అభివృద్ధి పక్కన పెట్టి ఆస్తులు పెంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాల నుంచి బహుజన్‌ సమాజ్‌ పార్టీ నాయకు లు తదితరులు పాల్గొన్నారు.
పిట్లంలో బైక్‌ ర్యాలీ
పిట్లం: మండల కేంద్రంలో బీఎస్‌పీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు బీఎస్పీ నాయకులు ఘనంగా బైక్‌ ర్యాలీతో స్వాగతం పలికారు. ర్యాలీగా నాయకులు అంబేద్కర్‌ చౌరస్తా వద్దకు చేరుకున్నారు. అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమ ంలో రాష్ట్ర బీఎస్పీ నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T04:55:46+05:30 IST