ఉమ్మడి జిల్లాలో జోరుగా కల్తీ కల్లు విక్రయాలు
ABN , First Publish Date - 2021-01-12T05:01:31+05:30 IST
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీకల్లు విక్రయాలు య థేచ్ఛగా సాగుతున్నాయి. కొందరు కల్లు వ్యాపారులు ధనార్జ నే ధ్యేయంగా స్వచ్ఛమైన కల్లుకు బదులు వివిధ రకాల ప్రా ణాంతక మత్తు పదార్థాలను కలుపుతూ కృత్రిమ కల్లును త యారు చేస్తూ.. గ్రామీణ, పట్టణ ప్రజల ప్రాణాలతో చెలగా టం ఆడుతున్నారు.
ధనార్జనే ధ్యేయంగా కృత్రిమ కల్లును తయారు చేస్తున్న పలువురు వ్యాపారులు
ప్రాణాంతక మత్తుపదార్థాలతో తయారీ
కల్తీ కల్లుకు చిత్తవుతున్న యువకులు, గ్రామీణ ప్రజలు
పట్టణ కేంద్రాల్లోని దుకాణాలలోనూ జోరుగా దందా
దుకాణాలు, డిపోలపై ఎక్సైజ్ శాఖ నిఘా కరువు
కామారెడ్డి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీకల్లు విక్రయాలు య థేచ్ఛగా సాగుతున్నాయి. కొందరు కల్లు వ్యాపారులు ధనార్జ నే ధ్యేయంగా స్వచ్ఛమైన కల్లుకు బదులు వివిధ రకాల ప్రా ణాంతక మత్తు పదార్థాలను కలుపుతూ కృత్రిమ కల్లును త యారు చేస్తూ.. గ్రామీణ, పట్టణ ప్రజల ప్రాణాలతో చెలగా టం ఆడుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కల్తీ కల్లు వ్యాపారం జోరుగా కొనసాగుతున్నా.. ఎక్సైజ్ అధికారు లు తూతూ మంత్రంగా దాడులు చేస్తున్నారే తప్ప కఠిన చ ర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 305 కల్లు సొసైటీలు
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 305 కల్లు సొసైటీలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 400ల వరకు కల్లు దుకాణాలు ఉన్నట్టు ఎక్సైజ్ అధికారుల రికార్డు లు చెబుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 243 సొసైటీలు ఉండగా, 481 గీత కార్మిక సంఘాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో కల్లు డిపోలు 22 ఉండగా.. కల్లు బట్టీలు 160 ఉ న్నాయి. గీత కార్మికులు 1,200ల మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఈత, తాటి చెట్లు పెద్ద మొత్తంలో లేవు. ఉన్న వా టి నుంచే కల్లును తీసి గీత కార్మికులు కల్లులో నీళ్లు కలుపు తూ విక్రయిస్తున్నారు. కానీ కొందరు వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా చెట్ల నుంచి తీసిన కొద్దిపాటి కల్లును మత్తు ప దార్థాలతో కల్తీ చేస్తూ విక్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు వ్యాపారం కొంతకాలం పాటు తగ్గుముఖం పట్టిన ప్పటికీ ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ జోరుగానే సాగుతోం ది. గతంలో కల్తీ కల్లులో ప్రధానంగా వాడే మత్తు పదార్థాల సరఫరాపై నిఘా పెట్టి దాడులు నిర్వహించారు. అప్పట్లో క ల్తీ కల్లులో కలిపె మత్తు మందులను సరఫరా చేసే వారిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని పెద్దమొత్తంలోనే ముడి సరుకు లను స్వాధీనం చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఈ క్రమం లో కొద్దిరోజుల పాటు కల్తీ కల్లు వ్యాపారం తగ్గింది. ఇటీవల ఈ వ్యాపారం మరింత పెరిగింది.
పలు రకాల మత్తు పదార్థాలను ఉపయోగిస్తూ..
జనాన్ని మత్తులో చిత్తు చేసేందుకు కల్లులో అల్ఫాజోలం, డైజోఫామ్, క్లోరో హైడ్రేడ్ లాంటి ప్రమాదకరమైన మత్తు ప దార్థాలను ఉపయోగిస్తూ వ్యాపారులు కల్తీ కల్లును తయా రు చేస్తున్నారు. గతంలో కల్తీ కల్లు తయారీలో వ్యాపారులు డైజోఫామ్ క్లోరోహైడ్రేడ్ లాంటి మత్తు పదార్థాలను ఉప యోగించేవారు. వీటి లభ్యత తగ్గడం.. ధర ఎక్కువగా ఉండ డంతో ఇటీవలి కాలంలో అల్ఫాజోలం అనే మత్తు మందు ను ఎక్కువగా ఉపయోగించి కల్లును తయారు చేస్తున్నారు. తాటి చెట్ల నుంచి తీసిన కొద్దిపాటి కల్లులో నీల్లు పోసి మ త్తుమందు కలిపిన అనంతరం తియ్యగా ఉండేందుకు చెక్రీ న్ పౌడర్, పులుపు కోసం ఈస్ట్ పౌడర్, నురుగు కోసం కుం కుడు రసం పోస్తున్నారు. మరిన్ని హానికరమైన పదార్థాలను కూడా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఉమ్మడి జి ల్లాలోని అన్ని కల్లు దుకాణాల్లోనూ కల్తీ కల్లే విక్రయిస్తున్నారు. గతంలో పలు కల్లు దుకాణాలలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేసి టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షించగా క్లోరో హైడ్రైడ్ ఉన్నట్లుగా గుర్తించారు. అంతే కాకుండా గతంలో పిట్లం, భి క్కనూరు, దోమకొండ, మండలాల్లో పలు కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే అల్ఫాజోలం, డైజోఫామ్ లాంటి మత్తు పదార్థాలను ఎక్సైజ్ పోలీసులు రెడ్‌హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో పలువురు వ్యాపారులు ప్రమాదక ర మత్తు పదార్థాలను కల్లులో వినియోగిస్తూ జోరుగా కల్తీ కల్లు తయారు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఉమ్మడి జిల్లా అంతటా ఇదే పరిస్థితి
ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా నిజా మాబాద్ నగరంతో పాటు ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బా న్సువాడ, ఎల్లారెడ్డి పట్టణంలోనూ కల్తీ కల్లు విక్రయాలు జో రుగా సాగుతున్నాయి. పొద్దంతా పని చేసి అలసిన కష్టజీవు లు తమ అలసటను అధిగమించేందుకు కల్లు తాగుతుంటా రు. దీనిని అదనుగా భావిస్తున్న పలువురు కల్లు వ్యాపారు లు మత్తు పదార్థాలతో కృత్రిమ కల్లును తయారు చేస్తూ ప్ర జలకు అంటగడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కల్తీకల్లుకు యువకులు, కూలీలు బానిసలవుతున్నారు. తెలి సీ తేలియని వయసులో కల్లు తాగడం అలవాటుకు చేసుకొ ని మత్తుకు బానిసలవుతున్నారు. గతంలో గ్రామాల్లో స్వచ్ఛ మైన కల్లు లభించేది. ఇప్పుడు అంతటా కల్తీ కల్లే రాజ్యమే లుతోంది. దీనికి అలవాటు పడిన వారు మానసికంగా, శారీ రకంగా కుంగిపోతున్నారు. దీంతో చిన్న వయసులోనే మోకా ళ్లు, కీళ్ల నొప్పులు, బుద్ధి మందగించడం, బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మత్తులో ఏం చేస్తున్నారో తెలియక పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఈ కల్తీ కల్లు దొరకని సమయంలో మానసికంగా కుంగిపోతూ ఎం దరో ఆసుపత్రుల పాలైన ఘటనలూ అనేకం ఉన్నాయి.
కల్లు దుకాణాలపై నిఘా కరువు
ఉమ్మడ్డి జిల్లాలోని కల్లు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ నిఘా కరువవుతోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎక్సైజ్ సర్కిల్ కా ర్యాలయాల అధికారులు కల్లు దుకాణాలలో కల్తీ కల్లు విక్ర యాలు జోరుగా సాగుతున్నా ‘మాములు’గానే తీసుకుంటు న్నారు. ఎక్సైజ్ నిఘా విభాగం అధికారులు దాడులు చేస్తు న్న సమయంలో కల్లు దుకాణాల్లో క్లోరోహైడ్రేట్, అల్ఫాజోల ం వంటి మత్తు పదార్థాలు లభ్యమవుతుండడం స్థానిక స ర్కిల్ ఎక్సైజ్ పోలీసుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పటికైనా ఎక్సైజ్ ఉన్నతాధికారులు సర్కిల్ కార్యాలయాల అధికారులను, సిబ్బందిని అలర్ట్ చేసి కల్లు దుకాణాలపై ఎ ప్పటికప్పుడు దాడులు చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవ సరం ఎంతైనా ఉంది.
కల్లు దుకాణాలలో తనిఖీలు చేస్తున్నాం..
శ్రీనివాస్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, కామారెడ్డి
జిల్లాలో కల్తీ కల్లు విక్రయా లు జరగకుండా కల్లు దుకాణాల లో తనిఖీలు చేస్తున్నాం. కల్తీ కల్లు తయారు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా కల్లు దుకాణాలను సీజ్ చేస్తు న్నాం. ఇటీవల అనుమతి లేని కల్లు బట్టీలపై దాడులు చేసి అక్కడ కల్లులో కలుపుతున్న మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం. ఎవరైనా కల్తీ కల్లు విక్రయాలు జరిపితే మాకు వెంటనే ఫిర్యాదు చేయాలి.