ఇంటింటికీ తాగు నీరు అందించడమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-09-03T05:20:32+05:30 IST

ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడానికి ప్రభుత్వం 40వేల కోట్ల రూపాయలతో మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టిందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు.

ఇంటింటికీ తాగు నీరు అందించడమే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న స్పీకర్‌ పోచారం

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ టౌన్‌, సెప్టెంబరు 2: ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడానికి ప్రభుత్వం 40వేల కోట్ల రూపాయలతో మిషన్‌ భగీరథ  పథకాన్ని చేపట్టిందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. గురువారం ఆయన బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో మిషన్‌ భగీరథ అధికారులు, బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్‌, వర్ని, కోటగిరి, నస్రుల్లాబాద్‌, బాన్సువాడ, రుద్రూర్‌, మోస్రా, చందూర్‌ మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వార్డు కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమా వేశాన్ని నిర్వహించారు. బోర్లలోని నీరు కలుషితం కావడంతోనే ప్రజలు కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నారని, ఆ బాధల నుంచి ప్రజలను విముక్తి కలిగించడానికే మిషన్‌ భగీరథ నీరు అందిస్తున్నామన్నారు. నదుల్లోని వర్ష పు నీటిని శుద్ధి చేసి మిషన్‌ భగీరథ పథకంలో పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీళ్లు ఇంటింటికి చేరేలా చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. బాన్సువాడ మండల పరిధిలోని 24, 279 ఇళ్లకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా నల్లా కనెక్షన్లు ఇచ్చామన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరాతో పాటు పారిశుద్ధ్యం, హరితహారం, వీధి దీపాల నిర్వహణ క్రమం తప్పకుండా చేపట్టాలని సర్పంచులకు సూచిం చారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల నిర్వహణకు నెలకు 308 కోట్లు, మున్సిపాలిటీలకు 138కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుద్దాల అంజి రెడ్డి, బాన్సువాడ మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, సొసైటీ చైర్మె న్లు ఎర్వల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్‌, బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాం రెడ్డి,మిషన్‌ భగీరథ అధికారులు, ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-03T05:20:32+05:30 IST