యువకుడి అదృశ్యం

ABN , First Publish Date - 2021-10-20T05:20:54+05:30 IST

ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండల కేంద్రంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన 21 ఏళ్ల విష్ణు భార్యతో కలిసి కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని బంధువుల ఇంటికి ఈనెల 16వ తేదీన వెళ్లారు. ఆ మరుసటి రోజు పనినిమిత్తం బయటకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు, బంధువులు ఆందోళన కు గురై సమీప ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. విష్ణు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సుధాకర్‌ తెలిపారు.

యువకుడి అదృశ్యం

దోమకొండ, అక్టోబరు 19: ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండల కేంద్రంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన 21 ఏళ్ల విష్ణు భార్యతో కలిసి కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని బంధువుల ఇంటికి ఈనెల 16వ తేదీన వెళ్లారు. ఆ మరుసటి రోజు పనినిమిత్తం బయటకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు, బంధువులు ఆందోళన కు గురై సమీప ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. విష్ణు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సుధాకర్‌ తెలిపారు.

వినాయక్‌నగర్‌కు చెందిన మున్సిపల్‌ కార్మికుడు..

ఖిల్లా: నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన మున్సిపల్‌ కార్మికుడు టేకి అశోక్‌ ఈనెల 8 నుంచి కనిపించడం లేదని ఆయన కూతురు ఫి ర్యాదు చేశారని ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపారు. అశోక్‌ భార్య కరోనాతో ఇటీవల మృతి చెందడంతో అతడు మద్యానికి బానిసయ్యాడని అన్నారు. 8న సాయంత్రం బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన వ్యక్తి రాకపోవడం తో పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Updated Date - 2021-10-20T05:20:54+05:30 IST