గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-03T06:23:09+05:30 IST

గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభు త్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
కారేపల్లిలో మొక్క నాటుతున్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
భీమ్‌గల్‌ రూరల్‌, జూలై 2: గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన భీమ్‌గల్‌ మండలం దేవునిపల్లి, కారేపల్లి గ్రామాలలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమాలలో పాల్గొన్నారు. కారేప ల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కనాటారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ తెచ్చిన పల్లె ప్రగతి తో గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చే నిధులు నేరుగా గ్రామాల అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్ర కృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, గ్రా మాని ఒక ట్రాక్టర్‌, రైతు వే దికలు ఇలా పల్లెలు సమగ్రాభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. దేవన్‌పల్లి గ్రామంలోని వడ్డెరకాలనీ వద్ద మహిళలు రోడ్డు సమస్యను మంత్రి దృష్టికి తీసుకురా గా వెంటనే ఐదు సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.15 లక్షల నిధులను మంజూరు చేశారు. అనంతరం కారేపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలు వీధుల్లో కలియతిరిగారు. కారేపల్లి గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.10 లక్షల అద నపు నిధులు మంజూరు చేశారు.

Updated Date - 2021-07-03T06:23:09+05:30 IST