విద్యాసంస్థల బంద్ నిర్ణయాన్ని పునరాలోచించాలి
ABN , First Publish Date - 2021-03-25T05:00:36+05:30 IST
ఇంటర్మీడియట్, 10వ తరగతి వార్షీక పరీక్షలను దృష్టి లో ఉంచుకుని, ప్రవేశపరీక్షలకు గడువు దగ్గర పడుతున్న సమయంలో విద్యాసంస్థల బందు నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల ఉమ్మడి జిల్లాల యాజమాన్య సంఘం సభ్యులు బాలాజీరావు అన్నారు.

కామారెడ్డిటౌన్, మార్చి 24: ఇంటర్మీడియట్, 10వ తరగతి వార్షీక పరీక్షలను దృష్టి లో ఉంచుకుని, ప్రవేశపరీక్షలకు గడువు దగ్గర పడుతున్న సమయంలో విద్యాసంస్థల బందు నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల ఉమ్మడి జిల్లాల యాజమాన్య సంఘం సభ్యులు బాలాజీరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఇంటర్‌నోడల్ అధికారి షేక్‌సలాంకు వినతి పత్రం అంద జేశారు. విద్యాసంస్థలు ప్రారంభం తర్వాత అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటూ తరగ తులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ విద్యాసంస్థల భవిష్యత్తును, ప్రైవేట్ అధ్యా పకుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల న్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘం సభ్యులు హన్మంత్‌రావు, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.