కేంద్రం మొండి వైఖరిని విరమించుకోవాలి
ABN , First Publish Date - 2021-12-09T05:40:33+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తమ మొడ వైఖరిని విరమించు కోవాలని రాష్ట్ర 1104 నాయకుడు రఫీక్ హెచ్చరిం చారు.

మెండోర, డిసెంబరు8: కేంద్ర ప్రభుత్వం తమ మొడ వైఖరిని విరమించు కోవాలని రాష్ట్ర 1104 నాయకుడు రఫీక్ హెచ్చరిం చారు. బుధవారం మండలంలో పోచంపాడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పా ర్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్న విద్యుత్ చట్టం సవ రణ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర ఎన్‌సీ సీవోఈఈ యూనిట్ పిలుపు మేరకు విద్యుత్ ఉద్యోగులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొంత మంది ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా విద్యుత్ సంస్థలను సహజ వనరులను ప్రైవేటుపరం చేయాలనే ఉద్దేశంతో సవరణ బిల్లును చట్టంగా మార్చాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ చట్టం ద్వారా ప్రజలు, రైతాంగం, విద్యుత్ ఉద్యోగులు ఇబ్బందిపడే అవకాశాలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం తమ మొండి వైఖరిని విరమించుకోకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్, షిండే, భరత్, విద్యుత్ ఉద్యోగ సంఘాలు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ప్రైవేట్ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ జేఏసీ నిరసన
సుభాష్‌నగర్: కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టిన విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లుకు వ్యతిరేకంగా జిల్లా విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని పవర్‌హౌస్ కార్యాలయ ఆవరణలో మధ్యహ్న భోజన సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా 1104 యూనియన్ అధ్యక్షుడు రఘునందన్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తప్పకుండా కలిసికట్టుగా ఉండి విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా చూస్తామన్నారు. ఈ నెల 15న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి 1వరకు నిర్ణయాన్ని వెనక్కితీసుకోకపోతే సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ లక్ష్మారెడ్డి, డీఈలు వెంకటరమణ, ముక్తార్, తోట రాజశేఖర్, శ్రీనివాస్, కాశీనాత్, సురేష్, అశోక్, రాజేందర్, బాబా శ్రీనివాస్, రాజేంధర్, శ్యాం, తదితరులు పాల్గొన్నారు.