బాలుడి పైనుంచి ట్రాక్టర్‌ వెళ్లడంతో మృతి

ABN , First Publish Date - 2021-12-25T05:35:25+05:30 IST

పుట్టు వెంట్రుకల శుభకార్యానికి వెళ్లి తిరి గి వస్తుండగా ఓ బాలుడి పై నుంచి ట్రాక్టర్‌ వెళ్లడంతో మరణించాడు. ఈ సంఘటన మండలంలోని దుర్కి గ్రామంలో చోటు చేసుకుంది.

బాలుడి పైనుంచి ట్రాక్టర్‌ వెళ్లడంతో మృతి

నస్రుల్లాబాద్‌, డిసెంబరు 24: పుట్టు వెంట్రుకల శుభకార్యానికి వెళ్లి తిరి గి వస్తుండగా ఓ బాలుడి పై నుంచి ట్రాక్టర్‌ వెళ్లడంతో మరణించాడు. ఈ సంఘటన మండలంలోని దుర్కి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామానికి చెందిన అమృతం రాజు తన కుటుంబీకులతో కలిసి నస్రుల్లాబా ద్‌ మండలంలోని దుర్కి గ్రామంలోని వారి బంధువులు ఇంటికి శుభకార్యానికి వెళ్లారు. బంధువులు అందరూ కలిసి ట్రాక్టర్‌లో బిచ్కుంద మండలంలోని వాజిద్‌నగర్‌ గ్రామంలోని అమ్మవారి ఆలయంలో పుట్టు వెంట్రుకల కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమాన్ని ముగించుకుని తిరుగు ప్రయాణంలో దుర్కి గ్రామానికి వస్తుండగా సహకార సంఘ సమిపంలోని రహదారిపై గల గుంతలో నుంచి ట్రాక్టర్‌ వెళుతుండగా ఇంజన్‌పై నానమ్మ ఒడిలో కూ ర్చున్న అమృతం యశోదర్‌(9) అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో ట్రాక్టర్‌ టైరు యశోదర్‌పై నుంచి వెళ్లింది. బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందినా పోలీసులు స్పందించకపోవడంతో గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-12-25T05:35:25+05:30 IST