అశోక్‌సాగర్‌ చెరువులో శవం లభ్యం

ABN , First Publish Date - 2021-10-31T05:56:35+05:30 IST

మండలంలోని జానకంపేట అశోక్‌సాగర్‌ చెరువులో గుర్తు తెలియని పురుషుడి శవం లభ్యమైంది. శవాన్ని గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ బయటకు తీయించారు.

అశోక్‌సాగర్‌ చెరువులో శవం లభ్యం

ఎడపల్లి, అక్టోబరు 30: మండలంలోని జానకంపేట అశోక్‌సాగర్‌ చెరువులో గుర్తు తెలియని పురుషుడి శవం లభ్యమైంది. శవాన్ని గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ బయటకు తీయించారు. మృతుడు నాలుగు రోజుల క్రితం చెరువులో పడి ఉండవచ్చని ఎస్సై ఎల్లాగౌడ్‌ పేర్కొన్నారు. 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందని, పంచనామాలో సదరు వ్యక్తి ముస్లింగా గుర్తించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అన్నారు.

Updated Date - 2021-10-31T05:56:35+05:30 IST