మోగనున్న బడిగంట
ABN , First Publish Date - 2021-08-25T06:25:08+05:30 IST
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలను సెప్టెంబరు 1వ తేదీ నుంచి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్, లాక్ డౌన్ నేపఽథ్యంలో చెబుతున్న ఆన్‌లైన్ పాఠాలకు ఇక తెరదించ నుంది. ఫస్ట్ వే, సెకండ్ వే కరోనా నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నర పాటు అన్ని విద్యా సంస్థలు మూతపడిన విషయం తెలిసిందే.

జిల్లాలో పునః ప్రారంభం కానున్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు
సెప్టెంబరు 1నుంచి ప్రత్యక్ష తరగతులు
ఆన్‌లైన్ పాఠాలకు తెర దించనున్న సర్కారు
పాఠశాలల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్న జిల్లా అధికార యత్రాంగం
కార్యాచరణను సిద్ధం చేస్తున్న విద్యా శాఖ
సమస్యల వలయాల్లో ప్రభుత్వ బడులు
చిట్టడవులను తలపిస్తున్న ప్రాంగణాలు
కనీస సౌకర్యాలు లేని పాఠశాలలు ఎన్నో..
జిల్లావ్యాప్తంగా మొత్తం 1400 పైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు
కామారెడ్డి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలను సెప్టెంబరు 1వ తేదీ నుంచి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్, లాక్ డౌన్ నేపఽథ్యంలో చెబుతున్న ఆన్‌లైన్ పాఠాలకు ఇక తెరదించ నుంది. ఫస్ట్ వే, సెకండ్ వే కరోనా నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నర పాటు అన్ని విద్యా సంస్థలు మూతపడిన విషయం తెలిసిందే. సెకాండ్ వేలో కరోనా సృష్టించిన బయానక వాతావరణంలో తెరిచిన విద్యా సంస్థలను, సైతం తిరిగి మూసివేశారు. ఆన్‌లైన్ తరగతులకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. ప్రస్తు తం కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుం డడంతో విద్యా సంస్థలను తెరిపించేందుకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ వర్గాలు సానుకులంగా స్పందిస్తుండగా.. తల్లి దండ్రుల నుంచి కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలు తెవ రడం మంచిదైనప్పటికీ.. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కొవిడ్ నిబంధనలను పక్కగా అమలు చేయాలని కోరుతున్నారు.
జిల్లాలో 1400కు పైగా పాఠశాలలు
కరోనా నేపథ్యంలో జిల్లాలో అన్ని రకాల విద్యా సంస్థలు మూసే ఉంటు న్నాయి. ఆన్‌లైన్ తరగతులకు మినహాయిస్తే.. ప్రత్యక్ష తరగతులు కొనసాగడం లేదు. పట్టణాల్లోని విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతునప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, ఫోన్లు ఉన్నా నెట్‌వర్క్ సేవలు అందకపోవడంతో విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు దూరమవుతున్నారు. దీంతో సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో అన్ని రకాల ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలు కలుపు కొని 1400 పైగా ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 1257 ఉండగా.. 1,46,589 మంది విద్యార్థులు ఉన్నారు. 200 వరకు ప్రైవేటు పాఠశాలలు ఉన్నా యి. ఇందులోని 60 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఇవే కాకుండా 45 వరకు ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 25 వేల మంది ఉన్నట్లు సమాచారం. మరో 15 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.
1 నుంచి తెరుచుకోనున్న బడులు
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో సెప్టెంబరు 1వ తేదీ నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు పాఠశాలల ప్రాంగణాలు, మరుగుదొడ్లు, మూత్రశాలల పరిశుభ్రత బాధ్యతలను పల్లెల్లో పంచాయతీలకు, పట్టణాల్లో మున్సిపాలిటీలకు అప్పగించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో పారి శుధ్యం, మౌలిక వసతులు కల్పించేందుకు పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఇప్పటికే జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తరగతులు ప్రారంభమై పిల్లలు వచ్చేలోపు బడికి కావాల్సిన మౌలిక వసతులపై నివేదికలు తయారు చేసి జిల్లా విద్యా శాఖకు పంపించాలని సూచించారు
సిద్ధమవుతున్న అఽధికారులు
ప్రభుత్వ నిర్ణయంతో పాఠశాలలను తెరిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన అన్ని విద్యా సంస్థలు, వసతి గృహాలను ఈనెల 30లోగా శానిటైజ్ చేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ శరత్ పాఠశాలల పునః ప్రారం భంపై మంగళవారం జిల్లా విద్యా శాఖతో పాటు మున్సిపల్, పంచాయతీ అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిం చారు. విద్యా సంస్థల్లో పారిశుధ్యం మెరుగుపరిచి అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మరుగుదొడ్లు, విద్యాసంస్థల ఆవరణలు, తరగతి గదులు, నీటి ట్యాంకులను సోడియంక్లోరైడ్, బ్లీచింగ్ పౌడర్ వంటి రసాయనాలతో శుభ్రం చేయాలన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీల్లో స్థానిక చైర్మన్లు, కౌన్సిలర్లు పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
సమస్యల వలయాల్లో పాఠశాలలు
సెప్టెంబరు 1నుంచి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు మాత్రం సమస్యలతో సతమతమవుతున్నాయి. దాదాపు ఏడాదిన్నర పాటు పాఠశాలలు తెరుచుకోక పోవడంతో సమస్యలు తాడవం చేస్తున్నాయి. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలుకనున్నాయి. ఏడాదిన్నర కాలంగా పాఠశాలలను పట్టించుకున్న వారే లేకపోవడంతో ప్రాంగణాలన్నీ చిట్టడవులను తలపిస్తున్నా యి. మరుగుదొడ్లు, మూత్ర శాలలు వృథాగా పడి ఉన్నాయి. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి వసతి కల్పించినప్పటికీ.. నీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తుంది. చాలా ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో అపరిశుభ్రంగా మారాయి. అసలే వర్షా కాలం సీజనల్ వ్యాధులతో ప్రజలు బాధ పడుతుండగా.. పాఠశాలలకు వెళ్తే మరిన్ని రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయ ని ఆయా గ్రామాలకు చెందిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతు న్నారు. అయితే, పాఠ శాలలు అన్నిం టినీ పరి శుభ్రంగా మా ర్చాలని, అంతేకాకుండా శానిటైజ్ చేసి అన్ని వస తులు కల్పించాలని విద్యా ర్థుల తల్లి దండ్రులు కోరుతు న్నారు. కరోనా నివారణ చర్య లు సైతం పాటించాలని అంటు న్నారు.
కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
: సంతోష్‌కుమార్, విద్యార్థి తండ్రి, అడ్లూర్
రెండేళ్లుగా ప్రత్యక్ష బోధన లేక పిల్లలు నష్టపోయారు. ఆన్‌లైన్ తరగతులు విద్యార్థులకు ఏమీ అర్థం కావడం లేదు. పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించడం మంచిదే. అయితే విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలి. పాఠశాలలో విద్యార్థులు కరోనా బారీన పడకుండా అన్ని జాగ్రతలు తీసుకోవాలి.
పాఠశాలల్లో సౌకర్యాల కల్పనపై దృష్టి సారిస్తున్నాం
: రాజు, డీఈవో, కామారెడ్డి
విద్యా సంస్థలను తెరవాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనపై దృష్టి సారిస్తున్నాం. కొవిడ్ నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో శానిటైజర్ చేపిస్తున్నాం. ప్రతీ పాఠశాలలో విద్యుత్, నీటి సౌకర్యంతో పాటు విద్యార్థులు మాస్క్‌లు ధరించేలా, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం.