బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2021-12-31T05:30:00+05:30 IST

బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని బీసీ సం క్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
బీర్కూర్‌లో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌

తెలంగాణ ఏర్పాటు అనంతరం 280 బీసీ గురుకులాలను ఏర్పాటు చేశాం

బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ 

బీర్కూర్‌, డిసెంబరు 31: బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని బీసీ సం క్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శుక్రవారం బీర్కూర్‌ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ షాపింగ్‌ కాంప్లెక్స్‌కు మంత్రి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు శంకుస్థాపన చేశారు. అనంతరం బీర్కూర్‌ గ్రామంలో రూ.6కోట్లతో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మా ణ పనులకు ఇరువురు శంకుస్థాపన, భూమిపూజ చేశారు. జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల, కళాశాలకు సంబంధించిన శిలాఫలాకా న్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు గత 70ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 19బీసీ గురుకుల పాఠశాలలుండేవని, రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని పేద విద్యార్థుల ఉన్నతి కోసం 280 బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు బీసీ గురుకుల పాఠశాలల్లో కేవలం 6వేల మంది విద్యార్థులు మాత్రమే విద్యనభ్యసి ంచే వారని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.31లక్షల మంది విద్యార్థులు బీసీ గురుకుల పాఠశాలల్లో విద్య నభ్యసిస్తున్నారన్నారు. పెద్ద పెద్ద కంపెనీలు, విదేశాల్లో చక్కటి చదువులు, ఉద్యోగాలు పొందుతు న్నారన్నారు. గురుకులాల్లో చదువుకునే విద్యార్థుల కోసం ఒక్కొక్క విద్యా ర్థిపై సంవత్సరానికి 1.25లక్షలు ఖర్చు చేస్తున్నారన్నారు. గతంలో తాను చదువుకునే రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో చల్లని నీటితో స్నానం చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి సోలార్‌ హీటర్లను పెట్టిస్తామన్నారు.


ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం సవతి తల్లి ప్రేమ : స్పీకర్‌

రాష్ట్రంలో రైతులు పండిస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయ ంలో కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలోని రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుల కళ్లల్లో నీరు వస్తే దేశానికి మంచిది కాదని, వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతులు పండించే ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య భట్టు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయిచంద్‌, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్‌ పాల్గొన్నారు. 

అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి

బాన్సువాడ : బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వచ్చిన బీసీ సంక్షేమ, పౌర సరఫ రాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట వద్ద ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాల డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అలాగే కలెక్టర్‌ జితేశ్‌ వి. పాటిల్‌ పుష్ప గుచ్ఛాలను అందజేసి మంత్రికి స్వాగతం పలికారు.

Updated Date - 2021-12-31T05:30:00+05:30 IST