చేపల వ్యాపారంలో అడ్డు తగులుతున్నాడని..

ABN , First Publish Date - 2021-07-12T05:46:50+05:30 IST

చేపల వృత్తి వ్యాపారంలో అడ్డు తగులుతున్నాడని ఓ వ్యాపారస్తుడు మరో వ్యాపారస్తుడిని హత్య చేయించడానికి ప్రయత్నం చేస్తుండ గా నిందితులను బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌ రెడ్డి పట్టుకున్నారు. ఆదివారం విలే కరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

చేపల వ్యాపారంలో అడ్డు తగులుతున్నాడని..

 హత్య చేయడానికి ప్రయత్నం 

రూ.10లక్షలు చెల్లిస్తానని ఒప్పందం 

నిందితులను పట్టుకున్న పోలీసులు
నిజాంసాగర్‌, జూలై 11: చేపల వృత్తి వ్యాపారంలో అడ్డు తగులుతున్నాడని ఓ వ్యాపారస్తుడు మరో వ్యాపారస్తుడిని హత్య చేయించడానికి ప్రయత్నం చేస్తుండ గా నిందితులను బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌ రెడ్డి పట్టుకున్నారు. ఆదివారం విలే కరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నిజాంసాగర్‌ మండలం పెద్ద ఆరే పల్లి గ్రామానికి చెందిన గూల్ల సిద్దప్ప, గూల్ల కృష్ణ వృత్తిపరంగా చేపల వ్యాపారం చేస్తారు. వ్యాపారంలో గూల్ల కృష్ణకు సిద్దప్ప అనే వ్యక్తి అడ్డు తగులుతున్నాడని ఈ నెల 7న గూల్ల కృష్ణ, పెద్ద ఆరేపల్లి, గూల్ల శంకర్‌, కృష్ణ బావ, కాశీరాం, రమే ష్‌, దత్తురాం, పిట్లంలు కలిసి సిద్దప్పను హతమార్చడానికి వెళ్లారని డీఎస్పీ తెలి పారు. సిద్దప్పను హతమార్చాలని, రూ.10లక్షల చెల్లిస్తానని శంకర్‌, కాశీరాం, రమేష్‌, దత్తురాంలకు చెప్పాడు. పథకం ప్రకారం హత్యకు ప్రయత్నించగా సిద్దప్ప కు అనుమానం రావడంతో వారిని నివారించి 8వ తేదిన నిజాంసాగర్‌ పోలీసుల కు ఫిర్యాదు చేశారు. బాన్సువాడ సీఐ చంద్రశేఖర్‌, ఎస్సై అహ్మద్‌, కానిస్టేబుళ్లు అనిల్‌, సుభాష్‌ దర్యాప్తు చేపట్టారు. గూల్ల కృష్ణ, కృష్ణ బావ శంకర్‌, కాశీరాం, రమే ష్‌, దత్తురాంలు హత మార్చడానికి ప్రయత్నించడంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సోమవారం బాన్సువాడ మున్సిఫ్‌ కోర్టులో హాజరు పరిచి రి మాండ్‌కు పంపనున్నట్లు ఆయన వెల్లడిం చారు. కేసులో పురోగతి సాధించిన సీ ఐ, ఎస్సై అహ్మద్‌, కానిస్టేబుళ్లు అనిల్‌, సుభాష్‌లను డీఎస్పీ ప్రశంసించారు. గూల్ల కృష్ణ అధికార పార్టీకి చెందిన ఓ కార్యకర్తగా చలామణి అవుతున్నాడు. కోర్టులో నిందితులను ప్రవేశపెట్టలేకపోవడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - 2021-07-12T05:46:50+05:30 IST