రేపు రాష్ట్ర స్థాయి సైక్లింగ్‌ పోటీలకు జట్టు ఎంపిక

ABN , First Publish Date - 2021-11-02T05:41:03+05:30 IST

రాష్ట్రస్థాయి రోడ్‌ సైక్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు జిల్లా జట్టును బుధవారం ఎంపిక చేయనున్నట్లు జిల్లా సైక్లింగ్‌ సంఘ కార్యదర్శి విజయ్‌కాంత్‌రావు తెలిపారు.

రేపు రాష్ట్ర స్థాయి సైక్లింగ్‌ పోటీలకు జట్టు ఎంపిక

సుభాష్‌నగర్‌, నవంబరు 1: రాష్ట్రస్థాయి రోడ్‌ సైక్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు జిల్లా జట్టును బుధవారం ఎంపిక చేయనున్నట్లు జిల్లా సైక్లింగ్‌ సంఘ కార్యదర్శి విజయ్‌కాంత్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో ఈనెల 6, 7 తేదిల్లో పోటీలు జరగనున్నాయని, ఉదయం 7గంటల నుంచి కంఠేశ్వర్‌ బైపాస్‌ రోడ్డులో జట్టును ఎంపిక చేస్తామన్నారు. అర్హులైన అండర్‌ 14, 16, 18 బాలబాలికలు పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సైకిలిస్టులు సొంత సైకిళ్లను, జనన ధృవీకరణ పత్రంతో హాజరుకావాలన్నారు. మరిన్నీ వివరాలకు 9912883331 నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీస్‌ క్రీడా పోటీలు..
ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీస్‌ క్రీడాపోటీలకు రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలకు జిల్లా జట్టును 6వ తేదిన ఎంపిక చేయనున్నట్లు జిల్లా యువజన, క్రీడా అధికారి ముత్తన్న తెలిపారు. 2020-21 సంవత్సరానికిగాను హైదరాబాద్‌లోని వివిధ స్టేడియాల్లో ఎంపిక పోటీలు జరుగుతాయన్నారు. అర్హులైన అభ్యర్థులు శనివారం కలెక్టరేట్‌ గ్రౌండ్‌లో ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలన్నా రు. 17అంశాల్లో క్రీడాపోటీలు జరుగుతాయన్నారు.

Updated Date - 2021-11-02T05:41:03+05:30 IST