అకాల వర్షానికి త డిసి ముద్దయిన ధాన్యం

ABN , First Publish Date - 2021-05-09T03:50:53+05:30 IST

మండలంలో శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. మండలంలోని అకాల వర్షాలతో మండలంలో ని అడవి లింగాల, వెల్లుట్ల గ్రామాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.

అకాల వర్షానికి త డిసి ముద్దయిన ధాన్యం
ఎల్లారెడ్డిలో కురిసిన వర్షానికి తడిసిన ధాన్యం

ఎల్లారెడ్డి, మే 8: మండలంలో శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. మండలంలోని అకాల వర్షాలతో మండలంలో ని అడవి లింగాల, వెల్లుట్ల గ్రామాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాల వద్ద సరైన వసతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహకార సంఘం నుంచి కనీసం టార్పాలిన్లు కూడా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి లారీలు రాకపోవడంతో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం కుప్పలు పెద్ద మొత్తంలో పేరుకపోయాయి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు తరుగు పేరుతో ప్రతీ లారీకి 5 నుంచి 8 క్విం టాళ్లు కోత పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహకార సం ఘం వారు కూడా పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. లారీ డ్రైవర్లు సైతం వడ్ల బస్తాలు లోడ్‌ చేసిన తర్వాత డబ్బులు ఇచ్చే వరకు లారీని రైస్‌మిల్లుకు తీసుకెళ్లమని డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు అలస త్వం, వరుణుడి ప్రతాపంతో తమ బతుకులు ఆగమ్యగోచరంగా తయారయ్యాయని రైతులు విలపిస్తున్నారు.
అవస్థలు పడుతున్న రైతులు
జుక్కల్‌: జుక్కల్‌ ప్రాంతంలో గత వారం రోజులుగా సాయంత్రం వేళలో ఈదు రు గాలులతో కూడిన అకాల వర్షం కురుస్తుండటంతో రైతన్నలు ఆందోళన చెందు తున్నారు. ప్రతీరోజు ధాన్యం ఆరబెట్టడం రాత్రి కురుస్తున్న వర్షానికి ధాన్యం తడిసి పోవడం మళ్లీ ఆరబెట్టడం జరుగుతుందని, దీంతో అవస్థలు పడుతున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తడిసి పోకుండా రాత్రనక, పగలనక కాపలా ఉంటున్నామని, నానా తంటాలు పడుతున్నామని పేర్కొంటున్నారు. చేతికొ చ్చిన పంట ఇంటికి వస్తుందో లేదోననే బెంగ పట్టుకున్నట్లు పేర్కొంటున్నారు.

Updated Date - 2021-05-09T03:50:53+05:30 IST