చందాపూర్‌లో ఒకరి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-03-21T06:03:03+05:30 IST

మండలంలోని చందాపూర్‌ గ్రామంలో శుక్రవారం రాత్రి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు తాడ్వా యి ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు.

చందాపూర్‌లో ఒకరి ఆత్మహత్య

తాడ్వాయి, మార్చి 20: మండలంలోని చందాపూర్‌ గ్రామంలో శుక్రవారం రాత్రి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు తాడ్వా యి ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గద్దరాజు పెంటయ్య(55) గత కొ న్ని రోజుల నుంచి కడుపు, మోకాళ్ల నొప్పు లతో బాధపడుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి దాటాక ఇంటి ముందర చెట్టుకు ఉరివేసుకున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భా ర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

పెద్దమల్లారెడ్డిలో..

భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఓ వృద్ధుడు ఉరివేసుకు ని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్‌ శనివారం తెలిపారు. ఎస్సై కథ నం ప్రకారం గ్రామానికి చెందిన శివయ్య(75) వ్యక్తిగత కారణాలతో గ్రామశి వారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతు డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2021-03-21T06:03:03+05:30 IST