అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-05T05:33:33+05:30 IST

అప్పుల బాధతో ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని ఎల్పుగొండ గ్రామం లో చోటు చేసుకుంది.

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

మాచారెడ్డి, మే 4: అప్పుల బాధతో ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని ఎల్పుగొండ గ్రామం లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పులిమామిడి నాగరాజు(25) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. దీనికి తోడు అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. గ్రామంలోని తుమ్మచెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తలి లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-05-05T05:33:33+05:30 IST