విద్యార్థుల ఆరోగ్యంపట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-11-26T05:46:50+05:30 IST

పాఠశాలలకు వచ్చే విద్యార్థుల ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు.

విద్యార్థుల ఆరోగ్యంపట్ల జాగ్రత్తలు తీసుకోవాలి


ఖిల్లా, నవంబరు 25: పాఠశాలలకు వచ్చే విద్యార్థుల ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశపు హాల్‌లో గురువారం విద్యా, వైద్యశాఖలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారితో మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి వచ్చేలా చూడాలన్నారు. డెంగ్యూ కేసులు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైద్యుల కొరత ఉన్నచోట వైద్యులను నియమించేందుకు ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం శిశు సంక్షేమశాఖలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జడ్పీ సీఈవో గోవింద్‌, జడ్పీ సభ్యులు భారతి, కోటగిరి శంకర్‌, సుమనరెడ్డి, సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-26T05:46:50+05:30 IST