ధాన్యం అమ్మకాల్లో సమస్యలపై పోరాడాలి

ABN , First Publish Date - 2021-05-18T05:43:06+05:30 IST

జిల్లాలో ధాన్యం అమ్మకాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కిసాన్‌ మోర్చా కార్యకర్తలు నిరంతరం పోరాటం చేయాలని ఎంపీ అర్వింద్‌ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన వర్చువల్‌ మీడియా లో కిసాన్‌ మోర్చా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

ధాన్యం అమ్మకాల్లో సమస్యలపై పోరాడాలి

కిసాన్‌ మోర్చా కార్యకర్తలకు ఎంపీ అర్వింద్‌ పిలుపు

నిజామాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ధాన్యం అమ్మకాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కిసాన్‌ మోర్చా కార్యకర్తలు నిరంతరం పోరాటం చేయాలని ఎంపీ అర్వింద్‌ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన వర్చువల్‌ మీడియా లో కిసాన్‌ మోర్చా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నెలన్నర రోజులు గడుస్తున్నా ఇంకా కొనుగోళ్లు పూర్తికాలేదన్నారు. రైతుల ధాన్యం ఇప్పటికీ కల్లాల వద్దనే ఉందని ఆయన ఆరోపించారు. జి ల్లాలో ధాన్యం తూకం వేసినా రోజుల తరబడి కొనుగోళు కేంద్రాల్లోనే ఉంచుతున్నారని ఎంపీ అర్వింద్‌ అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైస్‌ మిల్లర్లు 4 నుంచి 5 కిలోల వరకు తరుగు తీస్తున్నారని ఆయన అ న్నారు. ధాన్యాన్ని తరలించేందుకు వాహనాలతో పాటు కూలీల సమ స్య ఉన్నా పట్టించుకోవడంలేదని ఎంపీ విమర్శించారు. గత సంవత్స రం ఎఫ్‌సీఐ అధికారులు జిల్లాలో పర్యటిస్తే తరుగును తగ్గించారన్నా రు. ఈ సంవత్సరం యాసంగిలో మళ్లీ అదే రీతిలో తీస్తున్నారని ఆ యన అన్నారు. రైతాంగ సమస్యలపై కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో పో రాటం చేయాలన్నారు. నియోజకవర్గ నాయకులు కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను తీర్చేవిదంగా చూడాలన్నారు. రైతులందరికి జీలుగ విత్తనాలు సరఫరా అయ్యేవిధంగా చూడాలన్నా రు. ఎరువులు సరఫరా అయ్యేలా ప్రయత్నాలు చేయాలన్నారు. జిల్లా లో ఇంకా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, దానికోసం పోరాటం చేయాలన్నారు. తాను ఈ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షు డు బస్వ లక్ష్మినర్సయ్య, రాష్ట్ర కార్య దర్శి పల్లె గంగారెడ్డి, సీనియర్‌ నేత భూపతిరెడ్డి, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్య క్షుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-18T05:43:06+05:30 IST