కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-05-19T04:49:31+05:30 IST

మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం కల్లు దుకాణాల్లో ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు
కల్లు శాంపిళ్లను సేకరిస్తున్న ఎక్సైజ్‌ అధికారులు

రాజంపేట, మే 18: మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం కల్లు దుకాణాల్లో ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘కల్తీ కల్లు తాగొద్దని చాటింపు’ అనే వార్తకు ఎక్సైజ్‌ అధికారులు స్పందించి మంగళవారం పొందుర్తి, కొండాపూర్‌, ఎల్లారెడ్డిపల్లి, గుండారం, రాజంపేట గ్రామాల్లోని కల్లు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించినట్టు ఎస్‌ఐ పోతారెడ్డి తెలిపారు. శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైన కల్లు విక్రయాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసైన్స్‌ రద్దు చేస్తామని ఎస్‌ఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మహేష్‌, జీవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-19T04:49:31+05:30 IST