జిల్లాలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయండి

ABN , First Publish Date - 2021-08-21T05:46:06+05:30 IST

జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లో మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి ఇంట్లో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నేతలతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు.

జిల్లాలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయండి
మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి

జిల్లా నేతలతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి

బోధన్‌, ఆగస్టు 20: జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లో మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి ఇంట్లో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నేతలతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. జిల్లా లోని అన్ని నియోజకవర్గాలో పార్టీ పరిస్థితిపై రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. సమన్వయంతో ముందుకు సాగాలని, అందరూ కలిసి పార్టీని ఏకతాటిపై ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అధికార టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాటాలు చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్‌ పార్టీదేనని, కాంగ్రెస్‌ కార్యకర్తలకు భరోసా ఇస్తూ పార్టీకి పూర్వ వైభవం తేవాలన్నారు. ఈ సమావేశంలో మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, తాహెర్‌బిన్‌ హందాన్‌, గడుగు గంగాధర్‌

Updated Date - 2021-08-21T05:46:06+05:30 IST