దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-02-06T04:01:19+05:30 IST

రానున్న సీజన్‌లో గ్రామాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆశావార్కర్‌లు కృషి చేయాలని జిల్లా మలేరియా నియంత్రణ అధికారి డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ అన్నారు.

దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలి

భీమ్‌గల్‌, ఫిబ్రవరి5: రానున్న సీజన్‌లో గ్రామాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆశావార్కర్‌లు కృషి చేయాలని జిల్లా మలేరియా నియంత్రణ అధికారి డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ అన్నారు. పట్టణంలోని ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఆశ వర్కర్‌లు, ఏఎన్‌ ఎంలు, సూపర్‌వైజర్‌లు, పీల్డ్‌స్టాప్‌కు డెంగ్యూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యాలాంటి లార్వాలను నిర్మూలిం చేం దుకు గాను చేపట్టిల్సిన చర్యలపై ఆయన వివరించారు. ఈ సందర్భం గా వీటి నిర్మూలనకు గాను కావాల్సిన కిట్లను ఆశ వర్కర్‌లకు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ అజయ్‌పవార్‌, ఆర్మూర్‌ డివిజన్‌ సబ్‌యూనిట్‌ ఆఫీసర్‌ సాయి, పీహెచ్‌ఎన్‌ అయేషరఫత్‌, భూలక్ష్మీ, మేరి, సూపర్‌వైజర్‌లు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్‌లు పాల్గొన్నారు. 

చౌట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశలకు కిట్ల అందజేత

కమ్మర్‌పల్లి: మండలంలోని చౌట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రి పరిధి గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తున్న 40 మంది ఆశవర్కర్‌లకు శుక్రవారం జిల్లా మలేరియా నియంత్రణ అధికారి డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ ఆశ డ్యూటీ కిట్లను అందజేశారు. ఆశ వర్కర్‌లు బాధ్యతగా సేవలం దిం చాలని సూచించారు. కార్యక్రమంలో సబ్‌యూనిట్‌ అధికారి సాయ న్న, హెచ్‌ఈవో శ్రీనివాస్‌, సత్యనారాయణ, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ శుక్రవారం డ్రైడేగా నిర్వహించాలని, దోమలు నిలువకుండా ప్రజలకు ఆవగాహన కల్పించాలని సూచించారు. 

Updated Date - 2021-02-06T04:01:19+05:30 IST