రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2021-01-10T06:17:48+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఎల్లారెడ్డి ఎమ్మె ల్యే జాజాల సురేందర్‌ అన్నారు.

రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ 

నాగిరెడ్డిపేట, జనవరి 9: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ అన్నారు. మండలంలోని గోలిలింగాలలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందజేయడంతోపాటు ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తూ రాష్ర్టాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకువెళుతుందన్నరు. ఎంపీపీ రాజ్‌దాస్‌, జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ సత్యం, ఏఎంసీ చైర్‌పర్సన్‌ రాధ, మాజీ అధ్యక్షుడు  ప్రతాప్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు సిద్దయ్య, సర్పంచ్‌ మురళి, సొసైటీల అధ్యక్షులు నర్సింలు, గంగారెడ్డి పాల్గొన్నారు. 

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత

ఎల్లారెడి: ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన యూసిఫద్దీన్‌, కళావతికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను స్థానిక ఎమ్మెల్యే సురేందర్‌ తన క్యాంపు కార్యాలయంలో శనివారం వారికి అందజేశారు. 


Updated Date - 2021-01-10T06:17:48+05:30 IST