నేటి నుంచి రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు
ABN , First Publish Date - 2021-11-27T05:11:08+05:30 IST
మామిడిపల్లిలోని సెయింట్‌పాల్ పాఠశాలలో శనివారం నుంచి రాష్ట్రస్థా యి సబ్‌జూనియర్ బాల్‌బ్యాట్మింటన్ పోటీలు నిర్వహి స్తున్నట్టు బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అ ధ్యక్షుడు మానస గణేష్, జిల్లా కార్యదర్శి శ్యామ్ శుక్ర వారం తెలిపారు.

ఆర్మూర్‌రూరల్, నవంబరు26: మామిడిపల్లిలోని సెయింట్‌పాల్ పాఠశాలలో శనివారం నుంచి రాష్ట్రస్థా యి సబ్‌జూనియర్ బాల్‌బ్యాట్మింటన్ పోటీలు నిర్వహి స్తున్నట్టు బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అ ధ్యక్షుడు మానస గణేష్, జిల్లా కార్యదర్శి శ్యామ్ శుక్ర వారం తెలిపారు. పోటీలకు వివిధ జిల్లాల నుంచి పది బాలుర జట్లు, ఎనిమిది బాలిక జట్లు హాజరుకాను న్నాయి. శనివారం ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పోటీలను ప్రారంభిస్తారన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు మైదానాన్ని, కోర్టులను సిద్ధం చేసినట్టు తెలిపారు.