హుజూరాబాద్‌ ప్రజలు న్యాయం వైపు నిలబడ్డారు

ABN , First Publish Date - 2021-11-03T05:08:04+05:30 IST

ఎన్ని కుయుక్తులు పన్నినా.. పెద్ద మొత్తంలో డబ్బు సంచులు కుమ్మరించినా హుజూరాబాద్‌ ప్రజలు న్యాయం వైపు నిలబడి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించార ని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార అన్నారు.

హుజూరాబాద్‌ ప్రజలు న్యాయం వైపు నిలబడ్డారు
జిల్లా కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకుంటున్న బీజేపీ నాయకులు

బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార
కామారెడ్డి టౌన్‌, నవంబరు 2: ఎన్ని కుయుక్తులు పన్నినా.. పెద్ద మొత్తంలో డబ్బు సంచులు కుమ్మరించినా హుజూరాబాద్‌ ప్రజలు న్యాయం వైపు నిలబడి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించార ని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార అన్నారు. మంగళవారం హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలిచిన సందర్భంగా జిల్లా కార్యాలయం వద్ద టపాకాయలు, మిఠాయిలు తినుపించుకుంటూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార పార్టీ ఒక్కో ఓటుకు రూ.6000 ఇచ్చి ప్రలోభాలకు గురిచేసినప్పటికీ న్యాయం వైపు ఉండి తమ ప్రియతమ నాయకుడిని గెలిపించుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనేదానికి ఈ విజయమే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తేలు శ్రీనివాస్‌, పట్టణ అధ్యక్షుడు విపుల్‌, కౌన్సిలర్‌లు శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, నరేందర్‌, ప్రవీణ్‌, రవి, సుజిత, మానస, నాయకులు భరత్‌, సురేష్‌, రఘ, వెంకట్‌, వీరేశం, సరోజ, దత్తేశ్వరీ,నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.
విజయోత్సవ సంబరాలు
పట్టణంలోని నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద బీజేపీ రాష్ట్ర నాయకుడు నీలం చిన్నరాజులు, ఎంజీ వేణుగోపాల్‌గౌడ్‌ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జూలురి సుధాకర్‌, కడేం శ్రీకాంత్‌, రమేష్‌, నరేష్‌ పాల్గొన్నారు. అలాగే మాచారెడ్డి, మద్నూర్‌, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌లో మండలాల్లో బీజేపీ శ్రేణులు సంబు రాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టపాకాయలు కాల్చి స్వీట్లు పంచు కున్నారు. సదాశివనగర్‌లో మండలంలోని పద్మాజీవాడి ఎక్స్‌రోడ్డు వద్ద మండల పార్టీ అధ్యక్షుడు బుడిగె నరసింహారెడ్డి పటాకులు కాల్చి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో రూపేందర్‌రెడ్డి, మర్కల్‌ ఎంపీటీసీ భైరవరెడ్డి, విఠల్‌, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిలో బీజేపీ నాయకులు అంబేద్కర్‌ విగ్రహం, గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీజేపీ నాయకులు క్రిష్ణారెడ్డి, రాములు, విద్యాసాగర్‌, సాయిబాబా, బాలకిషన్‌, ఎస్‌ఎన్‌రెడ్డి, దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు. గాంధారి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సాయిబాబా, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు కాట్రోత్‌ రవి, మాజీ ఎంపీపీ దశరథ్‌నాయక్‌, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. తాడ్వాయి మండల కేంద్రం లో బీజేపీ నాయకులు టపాకాయాలు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార మాట్లాడుతూ తెలంగాణలో వచ్చే ది బీజేపీ పాలనే అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగారెడ్డి, వెంకటరావు, లింగారావు, రవీందర్‌రావు, స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లింగంపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు టపాకా యలు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్య క్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దత్తురాంలు, నాయకులు రాంచ ందర్‌, మోహీద్‌, శివ్యయ్య, మురళి, శ్రీకాంత్‌రెడ్డి, లక్ష్మారెడ్డిలతో పాటు నాయకులు ఉన్నారు.

Updated Date - 2021-11-03T05:08:04+05:30 IST