పట్టణంలో పర్యటించిన స్పీకర్‌

ABN , First Publish Date - 2021-10-26T04:51:47+05:30 IST

పట్టణంలోని 2, 16 వార్డు ల్లో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పర్య టించారు

పట్టణంలో పర్యటించిన స్పీకర్‌
బోనం ఎత్తుకుని ఆలయానికి వెళుతున్న దంపతులు
బాన్సువాడ, అక్టోబరు 25 : పట్టణంలోని 2, 16 వార్డు ల్లో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పర్య టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ వార్డులో ఎలాంటి సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. కొత్తగా నిర్మిస్తున్న కోట దుర్గా భవానీ మాత ఆలయంపై నుంచి వెళుతున్న 3 ఫేజ్‌ ఎలక్ర్టిక్‌ లైన్‌ను అల్టర్నెట్‌ లైన్‌గా మార్చాలని సంబంధిత ఎలక్ర్టిసిటీ ఏఈని ఆదేశించారు. ఇల్లు లేని కొందరికి నూతనంగా వారి స్థలాల్లో నిర్మించుకుంటే అనుమతి ఇస్తామన్నారు. అలాగే స్థలాలు లేని వారికి తాడ్కోల్‌లో డబుల్‌ బెడ్‌ రూంలలో ఇస్తామన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో స్పీకర్‌ మాట్లాడారు.
గంగమ్మకు పూజలు..
మండలంలోని పోచారం గ్రామంలోని గంగమ్మ ఆల యంలో నూతనంగా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు. బోనం ఎత్తుకుని పోచారం స్పీకర్‌ దంపతులు, కుటుంబ సభ్యులతో ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన స్రవంతి కు టుంబ సభ్యులను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పరామర్శించారు. ప్రగాడ సానుభూతి, సంతాపాన్ని తెలిపారు. ఆయన వెంట ఆర్డీవో రాజాగౌడ్‌, మున్సిపల్‌ ఏఈ యుగందర్‌, సీనియర్‌ నాయకులు వాహబ్‌, కౌన్సిలర్‌ మోతీలాల్‌, మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్‌, ప్రవీణ్‌ కుమార్‌, కోనాపూర్‌ గంగాధర్‌, కార్యకర్తలు, నాయకులు తదితరులున్నారు.

Updated Date - 2021-10-26T04:51:47+05:30 IST