చెట్టు పై నుంచి పడి ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-02-27T04:44:00+05:30 IST
మండలంలో చెట్టుపై నుంచి పడి ఒకరు మృతిచెందిన సంఘటన చోటు చేసు కుంది.

పెద్ద కొడప్‌గల్, ఫిబ్రవరి 26: మండలంలో చెట్టుపై నుంచి పడి ఒకరు మృతిచెందిన సంఘటన చోటు చేసు కుంది. మండలంలోని కాస్లాబాద్ గ్రామానికి చెందిన కోట గోవింద్ (42) చింతపండు కొట్టడానికి చెట్టుపై ఎక్కి కిం దపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. బాన్సువాడ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. భార్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై మల్లారెడ్డి తెలిపారు.